Thursday 15 November 2012

నా ఊపిరి


సాయంకాలం లో 
సాగార తీరంలో 
ఆమె పాదాలను ముద్దాడుతున్న 
అలలను చుస్తే నాకు అసూయగా ఉంది 
ఆ అవకాశం నాకు లేదే అని 
ఆమె పాదాలకింద  మెత్తగా 
నలుగుతున్న నేలను చుస్తే 
న హృదయం  నలిగిపోతుంది 
తన సుతి మెత్తని పాదాలకింద 
నా  యద తివచిగా పరచలేక పోయనేనని 
నీలి కళ్ళ నోదుటిపై తన ముంగురులను 
మృదువుగా ఉయాలుపుతున్న గాలిని చుస్తే 
న చేతులు చిరాకు పడుతున్నాయి 
అ పని తాము చేయలేకపోయామేనని 
తన ఉచ్చ్వాస , నిచ్చ్వాస లను 
మోసుకొచ్చిన గాలిని తాకినా నా  ఊపిరి 
ఉక్కిరి ,బిక్కరి అవుతుంది 
తన ఊపిరి నేనవ్వలేకపోయనేనని 
ఐన ఆనందపడుతుంది 
తను నా  ఊపిరైందని.


                      రచన 
           సతీష్ కుమార్ , బోట్ల 
             బొట్లవనపర్తి 
              కరీంనగర్ 
          botla1987.mygoal@gmail.com
         botlasjindagi blogspot.in
         www.Jaitelangana.com

Wednesday 14 November 2012

మా పెరట్లో చింతచెట్టు




మా  నాయినమ్మ జెప్పుతుండేది 
మా తాత పెరటి పొలం కొన్నప్పుడు 
మా నయిన పెట్టిండని పెరట్లో చింత చెట్టు 
భద్రంగా గసిండని అది పెరిగెట్టు 
మా నయిన తో పాటే  అది పెరిగి 
అయినా జీవితాన్ని  ప్రతిబింబించే మహా  వృక్షమైంది 

శరదృతువులో రాలిన ఆకులతో 
చేనంతపరిచిన ఎర్ర తివాచి లా 
శ్రామిక వర్గానికి , విప్లవ మార్గానికి 
ప్రతిరుపంలా అగుపించేది 
మా నాయిన లోని ఆవేశాన్ని తలిపించేది 
వసంతంలో వికశించిన ఆకులతో 
వివిధ రకాల రంగులతో 
సర్వమత సమ్మేళనాన్ని సూచించేది 
మా నాయిన లోని ఆలోచనలాల అగుపించేది 
ఋతువులకు అది మారుతూ 
జీవిత దశలను చూపించేది 
మా నాయిన లోని సర్వగుణ సంమేలనంలా కనిపించేది 

ఎంత ఆత్మీయంగా పెంచాడో మా నాయిన 
ఎ అవసరం వచ్చిన దాని అంగాల్ని తుంచకుండా 
అంతే ఆత్మీయత కురిపించేది అది మా పై 
ఎండల్లో నీడయ్యేది 
వానల్లో గోడుగయ్యేది  
మాతో మమేకమై 
కతికొమ్మ ఆటలాడేది 
ఉగాదీ పచ్చడై నోరు తడిపేది 
చరై అమ్మ చేతి వంటకు రుచిని పెంచేది 


మా నాయిన జీవితాన్ని ప్రతిబింబిస్తూ 
మా నాయిన కన్నా కొంత ముందుగాల్నే నేలకొరిగింది 
మా నాయిన వొరిగిపాయినంక గూడా 
దాని అభిమానాన్ని చాటుకుంటూ 
ఆయానకు చితి పనుపైంది 
నయినా చితబస్మంలో మమేకమైంది 

నేను ఊరేల్లిన ప్రతిసారి 
పెరట్లోకేల్లుతాను 
అది నిలిచినా చోటికి చేరుతాను 
అక్కడ 
మా మా నాయిన అడుగుల అనవల్లెమైన కనిపిస్తాయోనని 
అది నిలిచినా క్షణాలేమైన తిరిగోస్తాయోనని 
అంతలోనే తేరుకొని 
అదంతా గతమని తెలుసుకొని 
బరువెక్కిన జ్ఞాపకాల బారంతో 
కన్నీళ్ళతో మసకబారిన దారుల్లో తిరిగోస్తాను 
ఐన 

మరణించిన మా నాయిన
మాలో జీవించి ఉన్నట్లే 
మా పెరట్లో చింతచేట్టు కుడా 
మాకు మరుపు లేని జ్ఞాపకమే 
మార్చలేని గతమే.........


                            రచన 
                   సతీష్ కుమార్ బోట్ల 
                       బొట్లవనపర్తి 
                         కరీంనగర్  
              botla1987.mygoal@gmail.com
                  botlasjindagi.blogspot.in
                    Jaitelangana.com

Tuesday 6 November 2012

రాత్రిం బవాళ్ళు





పగలుకి చితిపేర్చి 
వెలుగుకి తెర వాల్చి 
కనురెప్పలు ముసి 
కలల తెరచాప తేరాసి 
అందమైన అబద్ధపు అలలాపై 
అదృశ్యపు కాగితపు నావల పై 
తరతరాల ఆశల అవాలి తిరం వైపు 
యుగయుగాల రహస్యాలను శోదిస్తూ
చర చార అదమరపు  ప్రయాణం సాగిస్తూ 
చిరకాల స్వప్నం చేజిక్కించుకునే చివరి క్షణం లో 
రవి కిరణం తగిలి 
రాత్రి కరిగి 
కల ల తేరచాప వాల్చి 
కనులు తెరచి 
కటినమైన నిజం లోకి 
కాలగమనపు చక్రం లోకి 
కనిపిస్తున్న ఆశయాల సాధనకై 
కష్టాల కాసారాన్ని ఈదుకుంటూ 
కాంక్షను పోదిమిపట్టుకునే 
ఆకరి అడుగులో 
కాంతిని కమ్మేస్తూ 
కాంక్షను చిదిమేస్తూ 
చీకటి తెరలేస్తూ 
పగటికి చితి పేరుస్తూ ....
పగలు రాత్రులు 
రాత్రిం బవాళ్ళు 

                     రచన 
            సతీష్ కుమార్ బోట్ల 
             బొట్లవనపర్తి 
             కరీంనగర్ 
       Botlas jindagi blogspot.in
       WWW.Jaitelangana.com 

Friday 26 October 2012

మరణ మజిలి




రాత్రిం బవళ్ళ చక్రం లో 
జనన మరణాల జగత్తులో 
ఈ క్షణం జీవిస్తూ 
మరు క్షణం మరణిస్తూ 
ప్రతి క్షణాన్ని  ఆస్వాదిస్తూ 
అనుక్షణం మరణిస్తూ ,జీవిస్తూ ఉంటాను 
ప్రతి జీవితం ఒక్క అన్వేషణ 
ప్రతి అన్వేషణ ఒక్క మజిలి 
ప్రతి మజిలి మరణం వరకే 
మరణమే కదా జీవితపు ముగింపు 

పువ్వులు రాలిన కాడలు
తెగిపడిన తారలు
వెలుగుతూ కరిగే కొవ్వొత్తి 
వికసించి మోడుబారే వృక్షాలు 
అన్నిటి పయనం 
జీవిస్తూ మరణం వైపుకే 
చీకటిని నేట్టుకువచ్చే వేకువ 
వేకువను నేట్టుకువచ్చే చీకటి 
సాగర గోషను మోసుకొచ్చే అలలు
రాలిన పువ్వుల పరిమళాన్ని వెదజల్లే గాలి 
నిశబ్దాన్ని పెనవేసుకునే నిశీది
అన్నింటి మజిలి మరణమే 

ఉదయ అస్తమయాలలోన
తూర్పు ,పడమరలలోన ఎరుపెక్కే సిందూరం 
సాగర అలలను ముద్దాడే సౌర వికిరణాల మధ్యలోని 
మహోజ్వలమైన పగలు పరమపదిస్తేనే కదా 
చంద్రుడి వెలుగుల తారల జిలుగుల 
తామసికి తోరణమాయ్యేది  
రాత్రి మరణిస్తేనే వేకువ జన్మిస్తుంది 
వెలుగు అస్తమిస్తేనే చీకటి అంకురిస్తుంది 
శరదృతువు వరకు చెదరని చిరునవ్వుల శోబ
శిశిరంలో చేజరితేనే కదా 
వసంతోత్సాహం  వికసిస్తుంది 

ఏదైనా ఎంతకాలం శాశ్వతం 
మరణానికి ఏది కాదు అనర్హం 
ప్రతి మరణం  మరో జననం 
అందుకే అంతంకోసం కాదు 
ఆరంబం కోసం మరణించాలి 
సంతోషమే సర్వం అయితే 
దు;ఖనికి చోటుఉంటుందా 
విజయమే జీవితమైతే 
విషాదానికి విలువఉటుంద
జీవితమే శాశ్వతమైతే 
మరణానికి అర్ధం ఉంటుందా 

అందుకే 
మరణం వైపు జీవననదిని  సాగనివ్వాలి
మరణ పరిమళాలను వెదజల్లాలి 
మరణ సుస్వరాలు అలాపించాలి
మరణ మృదంగాన్ని మ్రోగించాలి 
మరణ మజిలిని సాగనివ్వాలి 
బ్రతుకుతూ మరణాన్ని అనునయించాలి     
మరణిస్తూ మరణన్ని ఆస్వాదించాలి . 

                                          రచన 
                                  సతీష్ కుమార్ , బొట్ల 
                                       బొట్లవనపర్తి 
                                        కరీంనగర్  
                                     9985960614
                           botla1987.mygoal@gmail.com                                           

చరిత్రకి ముందు - వెనుక ( or) చరిత్రకెక్కనినిజం



జనన మరణ ల మధ్య 
జరిగి పాయిన జీవిత పోరాటంలోన 
గతం లోకి తొంగి చూస్తే 
ఎం సాదించామో చెప్పాలేకపోతే  
ఎలా జీవించామో తెలియకపోతే 
ఎలా జీవించాలో అర్ధం కాకపోతే 
అల జీవించటం కన్నా 
మరణం నయ్యం 
జీవించిన మనకన్నా 
జీవంలేని రాళ్ళూ నయ్యం 

ప్రాణమున్న మనం చెయ్యలేని పనులు
ప్రాణంలేని ఎన్నో సదిస్తూన్నాయ్       
ఒక్కొక్కసారి బండరాళ్ళు సైతం 
నిర్మాణాలై చరిత్ర కేక్కుతున్నాయ్ 
కొండకోనలు  సైతం ఎన్నో జీవితాలకు  
ఆదారన్నిస్తూ చరిత్ర తో నడిచివస్తున్నాయి  
పుడ్చినంక  మనపై కట్టే సమాధులు సైతం 
బాటసారికి అలసట తిరస్తూన్నాయి    

జీవితంలో పోరాటం చేయలేనివాడు 
పోరాడి జీవితాన్ని గెలవలేనివాడు 
గెలిచినాదాన్ని పది మందికి పంచలేనివాడు 
చరిత్ర కేక్కనివాడు 
చరిత్ర సృష్టిoచలేనివాడు
మరణించిననాడు 
చరిత్రలో ఏ మార్పు నమోదు కాదు 
ఎందుకంటే   
గతం లేని జీవితం ఉండదు 
గొప్పతనం   లేని గతానికి విలువుండదు 
ఆలాంటి జీవితానికి ముందు వెనుక 
చరిత్రలో ఏమి  ఉండదు 
కారణం 
చరిత్రకెక్కని ఏ నిజమైన చరిత్రలో కలిసిపోతుంది 
మహోన్నతంగా ఎదగని ఏ జీవితమైన మట్టికొట్టుకు పోతుంది.

                                               రచన 
                                      సతీష్ కుమార్ .బొట్ల 
                                          బొట్లవనపర్తి 
                                            కరీంనగర్ 
                                          9985960614
                               botla1987.mygoal @ gmail.com
                                                   www.jaitelangana.com

ఈ మట్టి మనిషినే ...తెలంగాణా కవినే .....!




నేను వాన చినుకుకై తపించేటోన్ని 
నేను మట్టి వాసనకు పులకరించేటోన్ని
మట్టి పాటై  పలకరించే వాడిని 
కవిత్వపు వితై మట్టి నుండి మొలకేత్తేవాడిని
నేనో మట్టి మనిషిని 

పచ్చని నా నేల బీటలువారుతుంటే 
నా  నేలపై నా అస్తిత్వం అణగారుతుంటే 
నా నేలపై నన్ను వేరొకరు పాలిస్తుంటే 
నా మట్టిలో మోదుగు పూలను తుంచి 
కాగితపు పూలను పూయిస్తుంటే 
నా  మట్టిపాట గొంతు నులిమి
 కిరాయిపాట  గళమెత్తుతుంటే
నిజం అణిచివేయబడుతుంటే 
నిరంకుశత్వం పురివిప్పుతుంటే 
నా మట్టిలోని చరిత్రను మట్టికిందే సమాధి చేస్తుంటే 
నేను ఈ మట్టి కవినై 
నా ఈ మట్టి కోసం మహా కావ్యమవుతా 
నా ఈ మట్టి కోసం మహా పోరాటం నడుపుతా 

ఈ పోరాటం లోన
నా మస్తిష్కం నుండి దూసుకొచ్చే  ప్రతి అక్షరం
నా నేలను చేరబట్టిన వాళ్ళను చీల్చి చెండాడుతుంది 
నా నేలపై అవతలివాడి ఆధిపత్యాన్ని 
అడ్డంగా నరికేస్తుంది 
అణిచివేతలను చీలుస్తూ అగ్గి రవ్వై 
నా నేలపై నిలిచినా కాగితపు పూలను కాల్చివేస్తుంది 
అప్పుడు నా అక్షరం 
ఈ మట్టి మాటై నోరేత్తుతుంది 
ఈ మట్టి పాటై గళమెత్తుతుంది       
తనపై జరుగుతున్న దాష్టికాన్ని ప్రశ్నిస్తుంది 
ఎవడ్రా నన్ను ఎలేది 
ఎవడ్ర నా తనువును బీటలువార్చింది 
ఎవడ్రా నా ఒడిలోని జలాలు జుర్రుకుంది 
ఎవడ్రా నా ముఖ చిత్రాన్ని మార్చింది 
అంటూ మహా పోరాటానికి పూనుకుంటుంది 
మట్టి కవితై అక్షర శాపం పెడుతుంది 
మట్టి లోనుంచి మొలకెత్తిన ఎర్ర గులాబై పోరు దారులేస్తుంది 

నా నేల తనను తను ఆక్రమిన్చుకు నే0తవరకు
నామత్తిలో గోగుపూలు గుభాలిన్చెంతవరకు 
నా మట్టిలో తంగెళ్ళు తాండవమాడెంతవరకు   
నా నేల ముఖ చిత్రం పై కప్పిన ముసుగు తోలగెంతవరకు       
అక్షరాలను ఆయుధాలుగా చేసి '
కవిత్వాన్ని పోరాటంగా మలచి 
నా  ఈ మట్టి కోసం ఈ మట్టి కవినై 
హద్దులు లేని కవిత్వానికి 
హద్దులు గీసుకొని 
తెలంగాణ కవిత్వం లిఖిస్తాను 
అక్షర పోరాటం సాగిస్తాను 

ఈ పోరాటంలో 
చచ్చినా బ్రతికినా 
ఓడినా గెలిచినా
తెలంగాణా వచ్చేంతవరకు 
నేనెప్పుడు
ఈ మట్టి మనిషినే 
తెలంగాణా కవినే 

జై తెలంగాణ    జై జై తెలంగాణ 

                          రచన 
                   సతీష్ కుమార్ బొట్ల 
                        బొట్లవనపర్తి 
                         కరీంనగర్ 
                       9985960614
           botla1987.mygoal@gmail.com
                     www.jaitelangna.com

అమ్మ


తెల్లవారు జామున  లేచి 
పాలుపితుకుతుంటే అమ్మ 
పల్లె తల్లి పూలకరిన్చి పోయేది  
తన జీవితం లోని కష్ట సుఖాలను
కల్లాపి చేసి చల్లుతుంటే అమ్మ 
పోక్కిల్లెత్తిన  వాకిళ్ళు పరవశించి పోయేవి 
పసుపు కుంకుమలు ధరించిన గౌరమ్మాల 
పసిడివేలుగుల పండగల 
బతుకమ్మతో  బాజరులోకి   (వీది)  అడుగు పెడుతుంటే అమ్మ
ఆమెనే అనుసరించేవాళ్ళు తంగెల్లెత్తిన  తరుణీలందరూ    

ముత్యమంటి నవ్వు తో 
ముతైదువు ఛాయాతో 
తను ముందుంటే మంగళ ప్రదమంటూ
పట్టుపట్టి మరి పట్టుకేల్లెవారు (తిసుకేల్లెవారు )
పక్కవారు అందరు అమ్మను శుభకార్యాలకు 
అమ్మ అరంబిస్తే కార్యాలు అవిజ్ఞ మయ్యేవి  
అమ్మ పూజిస్తే రాయి దైవమయ్యేది    
కాని 
దైవమే  రాయైనవేల 
కడదాక తోడు ఉంటాడనుకున్ననాన్నను 
కాలం కాటేసి అమ్మను కాలచక్రం లో వదిలేసి వెళ్తే 
కన్నీరు అణుచుకొని మమ్మల్నికాచుకుంది  అమ్మ      

పసుపు కుంకుమలు రాలి 
నోదుటన విబూది  చేరి
ముతైదువు అన్న పదం మారి
మంగళప్రదం అన్నవారే  మాట మర్చుతుంటే
రాలిన పసుపు కుంకుమల తో 
సూర్యుడు అస్తమించిన ఆకాశంల 
శూన్యం ఆవహించిన అనంతంల
ఆరిపోని అశ్రుతడిని  దిగమింగుతూ అమ్మ.......

పూటకో మాట మార్చే పరులు 
పలు రకాలుగా ప్రవర్తించిన 
సమస్తం మాకు అమ్మే 
సకల శుబాప్రదం మాకు అమ్మే 
అమ్మే మా దైవం 
అంకితం ఆమెకే ఈ జీవితం .   

(నన్ను కని పెంచిన నా తల్లి కి పాదాబి వందనాలతో.............  )
     

                                                                                 రచన 
                                                          సతీష్  కుమార్ బొట్ల 
                                                               బొట్లవనపర్తి 
                                                                 కరీంనగర్
                                                            9985960614
                                                  botla1987.mygoal@gmail.com

జ్ఞాపకాలు

ఈ రోజు న మొబైల్ ఇన్ బాక్స్ చూసాను 
నిండి పోఇన  మెసేజెస్ డిలేట్ చేద్దామని 
కానీ న అ ఆలోచననే  డిలేట్ చేశాను 
ఎందుకంటే 
అవి మెసేజెస్ మాత్రమేకాదు 
నా  ఫ్రెండ్స్ , ఆత్మీయుల జ్ఞాపకాలు. 
వారిని నిత్యం నా  తో ఉంచే ఆనవాలు 

ప్రేమించే వయస్సులో


ప్రేమించే వయస్సులో నువ్వు కనిపించలేదు 
నువ్వు కనిపించాక ప్రేమించే తీరిక లేదు 
నిన్ను ప్రేమించాలనే కోరికతో 
తీరిక చేసుకొని 
నీకు చేరువవ్వాలని నేనొస్తే 
నువ్వు నాకు దురమయ్యవు 
నా హృదయానికి తీరని గాయమయ్యవు 
దాంతో
నాలో చిగురించిన ఆశను చిదిమేసి 
మళ్ళి ..............
తీరికలేని నా జీవితం లోకి నేను ....................


సతీష్ కుమార్ బొట్ల

ఊరు



వన చినుకు నేలను తాకగానే 
మట్టి వాసనా పరిమలించినట్లు 
మధురమైన స్మృతులు మదిలో మెదలగానే 
మా ఉరు జ్ఞాపకాలు సజీవ చిత్రాలై 
కనులలో కదలాడుతూ ఉన్నాయ్  
మా ఉరు........

చినుకు పలకరించగానే 
చిగురకుకు జన్మనిస్తూ  
పుడమి పై పచ్చని పైటనరేసేది
సినుకుల ఎద్దడి తగ్గినక 
సికరాల శిరస్సు పై 
సింగిడి రంగులనారెసేది 
అ క్షణం లో
 ఆకులపై నుండి  రాలి పడుతున్న 
నీటి  బిందువులతో ఆటలాడిన జ్ఞాపకాలు 
పచ్చని  చిర పై ఎర్రని బొట్లు పెట్టినట్లు 
పసిరిక నేలల్లో అరిద్ర పురుగుల ఆనవాలు 
చురు నీళ్ళ ను పల్లలతో పట్టిన స్మృతులు 
నీటిలో కాగితపు పడవలేసిన   గుర్తులు 
చెరువు నిండగానే చేపల వేటలు 
అలుగు మత్తల్ల కింద స్నానాల ఆటలు  

చలి ముదరగానే 
పొగమంచు తో అల్లేసేది 
ఒళ్ళు ను జలదరింప చేసేదీ 
నింగి నుండి హిమమై  కురిసి 
నేలపై పచ్చని పపసిరికపై ముత్యపు బిందువై మెరిసేది 
పదాలు తాకగానే గిలిగింతలు పెట్టేది 
పులకింత రేపేది 
అ క్షణం లో....
చలి మంటల చుట్టూ చేతులు నలుచుకుంటూ 
కూర్చున్న జ్ఞాపకాలు 
అమ్మ ఒల్లో తలవాల్చి పడుకున్న ఆనవాలు 

ఎండలు ముదరంగనే 
ఎగిలివారంగా తూర్పు నోదుటన సిందూరo  అయ్యేది   
చెర్లు  అన్ని ఎండి చెన్లన్ని కోసినంక 
సాయంకాలం గోదులి తో కమ్ముతూ 
ఎడారిని తలపించేది 
అరిపాదలకింద  మంటలు పెట్టేది 
ఆరుబయట పదకలెఇన్చెది 
అ క్షణం లో
చల్లదనం లో సేదతిరెందుకు 
ఈత  కొలనులో ఈదులడిన జ్ఞాపకాలు 
ఈతకాయల వెంట పరుగులెత్తిన క్షణాలు 
మరెన్నో మదురమైన జ్ఞాపకాలు 

గ్రామదేవతల కొలుపులు 
వనబోజనాలు
 పిరిల్ల ఆటలు 
బతుకమ్మ పాటలు 
దసరా వేషాలు 
ఉగాది ఉత్సావాలతో 
ఏడాదికి   కోక్కసారి జాతర 
ఏడాదంతా పండగాలగుండేది ఊరు .....

కనిప్పుడు 
కొలువులకోసం చదువుకున్నోళ్ళు ఊరు విడిచి వెళ్తుంటే 
చదువు లేనోళ్ళు వలసా బట పడుతుంటే 
ఏలిననాటి జ్ఞాపకాలతో కాలం  ఎల్లదిస్తున్నది 
 ఎల్లిపోతున్న ఊరు 

కులమతాలకు అతీతంగా 
అలై బలై ముచట్లతో 
ఆత్మీయ బంధమై 
అనురాగ గందమైన ఊరు ఇప్పుడు 
రాజకీయాలు గ్రామానికి చేరినంక 
వర్గాల పోరులో 
ఆధిపత్య జోరులో 
అహంకారిత చర్యలకు 
అరణ్య రోధనైంది .  

అదునికరణ పేరుతో 
నాగరికత నెపంతో 
పంట పొలాలను చిమేస్తూ 
ప్లాట్ లు వేలుస్తుంటే 
ఊరంతా పారించిన చెరువుకు 
ఊరులో చోటు లేకుంటే 
పచ్చని  వనసంపద 
ఫారెస్ట్ వాళ్ళు వశం చేసుకుంటే 
చివరికి కొండలు సైతం 
కాంక్రీట్ , గ్రానైట్ క్వారీలు 
కబలించి వేస్తుంటే 
జనం శ్రుతి తప్పుతుంటే 
ఊరు గతి తప్పుతూ 
గతాన్ని నెమరువేసుకుంటూ 
వర్తమానంలోకి వెళ్తుంది 
పుడమి పై పచ్చని పైటనరేసినట్లు 
ప్రకృతిని పొగమంచుతో కప్పెసినట్లు 
తుర్పునోదుటన ఎర్రని సింధూర మైనట్లు 
ఉండే నా  ఉరు ఇప్పుడు 
తన ఉనికిని కోల్పోయి 
 తన అస్తిత్వానికై  ఆరాటపడుతూ 
గతాన్ని నెమరువేసుకుంటూ 
గతం పునరావృతం  కావాలని 
కోరుకుంటుంది ఊరు ....

( మనసున్న మనుషులుగా ఆలోచిద్దాం మన ఊర్లను మల్లి నిర్మించుకుందాం !
villages are backbone of our country never distraid it.) 

                                                                              రచన 

                                                         సతీష్ కుమార్ బోట్ల 
                                                          బొట్లవనపర్తి 
                                                            కరీంనగర్              
                                                        9985960614
                                             botla1987.mygoal@gmail.com