Tuesday 16 January 2018

అక్షర సూరిళ్ళు

 

                      నిప్పుల రెక్కల ప్రశ్నల పై
నిరసనాలంకారాలు ఉరేగుతుంటే
నినాదాల హోరుతో నింగికేగిసిన గొంతుల పై
నిశ్శబ్దపు గానాలు వినబడుతుంటే
ఆత్మగౌరవం నినాదం తో అందలమేక్కినవాడె మనపై
అదికారపు ఆదిపత్య అహంకారం ప్రదర్శిస్తుంటే
అణచివేతలను అగ్గిరవ్వలుగా మర్చి
విప్లవాన్ని వెలిగించగల కాగడాలు
విశ్వానికి మరమత్తులు చేయగల కార్మికులు
నవతరం యువకులు / ఈతరం కలం వీరులు

నిజాలపై నిమురును కప్పుకొని
నిశబ్దాన్ని అలుముకున్న ఈ లోకం లో
విలువలపై పాశ్చత్య నాగరిక చీకటిని పూసుకొని
విష సంస్కృతిని విస్తరిస్తున్న నేటితరం లో
జబ్బుపట్టిన ఈ సమాజానికి వైద్యం చేయగల డాక్టర్లు
జవసత్వాలుడిగిన ఈ సమాజంలో
చైతన్యం నింపగల వెలుగు కిరణాలు
ఆదునిక తరం పోరాట యోధులు
అంకురిస్తున్న ఈ సాహిత్య భీజలు

అవార్డ్ ల కోసం అక్షరాలని
ఆస్తుల కోసం ఆస్థిత్వాన్ని
అమ్ముకునే అసమర్ధులు కారు వీళ్ళు
అక్షరాలని కిరణాలుగా వెలిగించి
అనునిత్యం ఈ లోకానికి వెలుగు పంచె
అక్షర సూరిళ్ళు
ఆదునికతరం యువ కవులు.  
రచన
సతీష్ కుమార్ బొట్ల
బొట్లవనపర్తి
9985960614
Botlasjindagi.blogspot.in