Friday 1 March 2013

కోటిలింగాల క్షేత్రం





తేలి వాహిని (గోదావరి ) తీరానా 
తెలంగి (తెలంగాణా ) శాతవాహన కాలనా 
ప్రజ్వాలించిన కిరణం లా 
ఉద్బావించిన తోలి తెలుగు రాజాదని గా  
తెలుగు చరిత్రకు భీజం 
తెలంగాణా ప్రాచిన సంస్కృతికి సజీవ సాక్షం 
కోటిలింగాల క్షేత్రం

హరిహర క్షేత్ర నిలయంగా 
అమరావతికన్న అతి ప్రాచీన ప్రాంతంగా 
చరిత్రను సృష్టించి 
 చరిత్ర లో నిలిచి 
చరిత్ర లో కలసి 
పురావస్తు తవ్వకాల్లో 
పూరాతన శాసనమై  వెలిసిన 
ప్రాంతీయ వివక్ష వలన 
ప్రాథమిక గుర్తింపునకు నోచుకోక 
పాలకుల వైపల్యం వలన 
పుస్తకాలకేక్కలేక పాయిన 
బౌద్ధ చారిత్రక గని
బృహత్ కథల మాగని 
కోటిలింగాల ఖని 

అభివృద్ధి పేరుతో 
ఆదారాలు రూపుమాపేందుకు 
ప్రాజెక్ట్ ల పేరుతో 
పక్షపాతానికి ముసుకేసుకొని 
మీరెన్ని సార్లు 
మా మూలాలను తోక్కేస్తున్న 
మళ్లి  మట్టిని చిల్చుకొని పైకోస్తూ 
తెలుగు బాషకు మూలం 
తెలుగు సంస్కృతికి తార్కం 
తెలంగాణా మట్టిలోనే పడిందని తెలిపే సాక్ష్యo 
 ఈ కోటిలింగాల క్షేత్రం.  

(చరిత్ర మన సంపద మన సంపద పై జరుగుతున్న దాడిని అడ్డుకుంద్దం మన చరిత్రను కాపాడుకుందాం 
మన కోటిలింగాల ......... మన కరీంనగర్ ....... మన తెలంగాణా . )

తెలంగాణా బిడ్డ మేలుకో 
తెలంగాణాచరిత్ర కాపాడుకో . 

                                రచన 
--                      సతీష్ కుమార్ బోట్ల   
                             బొట్లవనపర్తి 
                               కరీంనగర్ 
                             9985960614
                 botla1987.mygoal@gmail.com
                  http://botlasjindagi.blogspot.in
                        www.jaitelangana.com