Wednesday 9 May 2018

మిగిలింది..!




ఆక్షర నక్షత్రాల మీదనుండి
ఆశాలు జారి పడ్డప్పుడు
కలల మేడలు కూలి
కన్నీటి జాడలై నిలిచినప్పుడు
నమ్ముకున్న కలల్ని అమ్ముకోలేక
ఆత్మసంతృప్తినిచ్చే ఆశయాన్ని వదులుకోలేక
కలలకి, కన్నీళ్ళకి మధ్య
ఆశయాలకి , ఆదర్శాలకి మధ్య
అనుక్షణం సంఘర్షణలో అలసిన దేహాన్ని
అంపశయ్య లాంటి పక్కపైకి చేర్చి
కనుపాపలపై పరుస్తున్న నిద్ర దుప్పటిని
కర్కషంగ లాగేస్తున్నాయి కల్లోలపు ఆలోచనలు


వెన్నెల జల్లుల్లో వెలుగుతున్న పచ్చని ప్రకృతిని
వెచ్చని దావాగ్ని దాహించివేస్తూన్నట్లు
నిచ్చలమైన నీటితో స్తబ్ధంగా ఉన్న బావిలో
నిశబ్దాన్ని చేదిస్తూ బండరాళ్ళు దోర్లినట్లు
హృదయపు గదుల్లో నింపుకున్న ఉపిరి
ఉప్పెనై నన్ను ముంచేస్తూన్నట్లు
కన్నుల్లోని అందమైన కలలు
కన్నిరై కరిగిపోతున్నాయి



కలలో కన్నీళ్ళో ఏవైతేనేం
కాలంతోపాటే కరిగిపోయాక
నిజమో , నిద్రో ఏదైతేనేమి
నీ జీవితమే నిన్ను భయపెట్టక
జననమో , మరణమో ఏదైతేనేం
ఉపిరి మీదే ఆదారపడ్డక
గెలుపో ఓటమో ఏదైతేనేమి
ప్రయత్నం ముగిసి పోయాక
ఇప్పుడు చేయాల్సింది
పలితల విశ్లేషణ కాదు
ప్రయాణ౦ మాత్రమే
సాదించింది ఏదైనా
సాదిన్చాలిసింది ఏమైనా  
ఇప్పుడు మిగిలింది
జీవించటం మాత్రమే
జీవితాన్ని అనుభవించటం మాత్రమే.


                                                 రచన
                                    సతీష్ కుమార్ బోట్ల.
                                      బొట్లవనపర్తి
                                        కరీంనగర్
                                   Cell:9985960614
                   Botlasjindagi.blogspot.in 

నీటి జాడలు





మనిషి సౌఖ్యల కోసం  మనవ తప్పిదాలతో
వన అరణ్యల్లోని కొండల్ని కొల్లగొడుతూ
జన అరణ్యల్ని కాంక్రీట్ జంగల్ గా మారుస్తూ
పచ్చని ప్రకృతిని పతనం చేస్తూ
రుతువుల గతులను మార్చేస్తూ
లలినో ఎల్నినోలను ఎత్తుకొని
భూగర్భ జలాలను పాతాళం లోకి నెట్టుకొని
కరువు మేఘాలు దూసిన కత్తులకి
నేర్రాలు బారిన నేలను తడపటానికి
ఎంత తవ్విన ఉటతడిలేని కన్నీటి దారాలే
ఎంత వెతికిన నీటి జాడ లేని ఎడారి దారులే 
దర్శనమిస్తూ  నీటి ఉనికిని నిర్జీవం చేస్తున్నాయి

                          ప్రాణదారమైన నీటి వనరులను     
                          నగర నిర్మాణాల క్రింద సమదిచేస్తూ
                          వందల మీటర్ల బోరు పైపుల ద్వార నీటిని లగేస్తూ
                          మూడు మీటర్ల ఇంకుడు గుంతలు తవ్వితే ఫలితం ఎం ఉంటుంది 
                          డ్రినేజిల ద్వార  సముద్రం లో కలిసిన నీరు
                          డ్రై అయిన గొంతుకలను తడుపుతుoదా?
                         పాతాళం లోకి పడిపోతున్న నీరు
                          పగుళ్ళు పారిన నేలను పచ్చగా మారుస్తుందా?
                       

                          అందుకే రండి
                         నానాటికి వట్టిపోతున్న నీటిని
                         నేటినుండి రేపటి తరానికి కానుకివ్వటానికి
                         అడుగంటిపోతున్న నీటి జాడలు
                        భవిష్యత్తు తరాలకి కన్నీటి దారాలు కాకుండా ఉండటానికి
                        ప్రతి వర్షపు చినుకును ఒడిసిపట్టుద్దాం
                        ప్రతి నీటి వనరులను పునరుద్దరిద్దాం
                        ప్రతి నీటి బొట్టు సంరక్షణకు నడుముకట్టుద్దాం
                        ప్రపంచపు మనుగడకు పట్టం కట్టుద్దాం

                       ఒడిసి పట్టే ప్రతి నీటి బొట్టు
                       మన ప్రకృతికి పచ్చని మెట్టు
                       జారవిడిచే ప్రతి నీటి బొట్టు
                      మన బావిష్యత్తు కి కన్నీటి పెట్టు


రచన
                                    సతీష్ కుమార్ బోట్ల.
                                      అధ్యక్షులు  
                     కరీంనగర్ జిల్లా యువ రచయితల సంఘం
                                   Cell:9985960614
                                                            Botlasjindagi.blogspot.in