Saturday 16 December 2017

కాలం నా సహచరి


అణువు నుండి నేను ఆకారం పోసుకున్న క్షణం నుండి
అమ్మ ఒళ్ళో నుండి అవని ఒళ్లోకి చేరినప్పటినుండి
ఆమె తో నా ప్రయాణం ( సహచర్యం)  మొదలైంది  
ఉగ్గు పాలు  తాగుతూ ఉయాలలు ఉగుతున్న క్షణానా
ఉంగ ఉంగ అంటూ నిశ్శబ్దం తో ముచ్చటిస్తున్నా క్షణ నా
పాకుతూ పొర్లుతూ పసిడి నవ్వులు రువ్వుతున్న క్షణాo లో
పడుతూ లేస్తూ పరుగులు నేర్చుకుంటున్న క్షణం లో
ఆమె నా సహచరి

అమ్మ ఒడి వదిలి అక్షరం తో స్నేహం చేస్తున్నవేళా
అమాయకపు రెక్కలు తొడుక్కొని ఆశల లోకంలోకి ఎగురుతున్నవేళా
ని౦గి అంచులని తాకాలని నూతన కలాల్ని ప్రోగు చేసుకుంటున్న వేళా
ఆశలు అడిఆశలవుతాయని తెలుసుకుంటున్న మొదటి క్షణం లో
కలలు కల్లోలాన్ని మిగిలిస్తాయాని నేర్చుకుంటున్న క్షణం లో
నాన్న వేలు వదిలి నవ యవ్వనం లోకి అడుగు పెడుతున్నవేళ
పరువపు  ప్రవాహంలో మునిగి తేలుతున్న వేళా
ప్రణయ విఫల వేదనతో మనస్సు రోదిస్తున్న వేళా
ఆమె నా సహచరి

ఆలోచనలకు పదునుపెడుతూ ఆశయాలకై పరిగెడుతున్న క్షణo లో
ఆత్మ విశ్వాసం తో అవరోదాల్ని అదిగామిస్తున్న క్షణం లో
గెలుపు ఓటములను విశ్లేషించుకుంటున్న క్షణం లో
గాయాలని గేయాలుగా గానం చేసుకుంటున్న వేళా
ఆరాటం  , పోరాటాల ల మధ్య తేడాను బేరీజు వేసుకుంటున్న వేళా
ఆశ నిరాశ లని నాలోన నిక్షిప్తం చేసుకుంటున్న వేళా
ఆమె నా సహచరి 

జీవిత గమ్యాన్ని నిర్దేశిoచుకుంటున్న వేళా
జీవన సహచరిణి చేరుకుంటున్న వేళా
జీవన మదూర్యాన్ని చవిచూస్తున్న వేళా
జీవన వైపల్యాన్ని జీర్ణం చేసుకుంటున్న వేళా
జీవితాన్ని అన్వేషిస్తున్నవేళా
జీవితాన్ని జీవిస్తున్నా వేళా
ఆమె నా సహచరి

ఆలోచనకు అనుభవానికి మధ్య తేడాని
అవపోసనం పడుతున్న వేళా
అనుకున్నవి జరగక పోవటమే కాదు
అనుకోనివి జరగటమే జీవితం అని తెలుసుకుంటున్న వేళా
తన ప్రవాహంలోపడి కొట్టుకు పోవటమే తప్ప
తనను దాటుకొని వెళ్ళలేమనే నిజాన్ని నిర్దారించుకుంటున్న వేళా
ఆమె నా సహచరి

గతం చేసిన గాయాలపై 
జ్ఞాపకాల లేపనాలను పూస్తున్న వేళా
నడిసోచ్చే సమయం అయిపోయిన వేళా
నడిసోచ్చిన నిన్నని నెమరు వేసుకుoటున్న వేళా
అడుగు జాడలను ఆనవాళ్ళుగా మలచుకుంటున్న వేళా
అనుభవాల సారాన్ని అక్షరికారిస్తున్నవేళా
 ఆమె నా సహచరి

అమ్మ పోత్తిళ్ళ లో మొదలైన ఆ క్షణం నుండి
మట్టి పొత్తిళ్ళలో లోకి చేరే ఆకరి క్షణం వరకు
అప్పుడు ఇప్పుడు  ఎప్పుడూ
కాలమే (ఆమె) నా సహచరి.

                                               రచన
                                      సతీష్ కుమార్ బొట్ల
                                         బొట్ల వనపర్తి , 
                                          కరీంనగర్
                                                    9985960614.

Wednesday 27 September 2017

బతుకును కోల్పోతున్న బతుకమ్మ



తంగేడు పులా పరిమళాలతో
తరుణీమనుల నవ్వుల గలగలలతో  
నింగిలోని రంగులన్నీ నెలకు దించి
ముంగిళ్ళలో ముగ్గులుగామార్చి
ప్రకుతిలోని పూలన్నీ ప్రేమగా తుంచి
పుడమిపై  పులా సింగిడి పేర్చి
తీరొక్క పువ్వుల తీరైన పేర్పు
తిరుగుతూ బతుకమ్మ ఆడే ఆడపడుచుల ఓర్పు
పల్లె పడుచుల లంగా ఓణిల సోయగం
పట్నం పడుచుల పట్టు  చీరాల రాజసం  
చప్పట్ల సప్పుడ్ల పాట
సదళ్ళతో చిందేసే సంప్రదాయపు ఆట
 మనకు బతుకు నేర్పిన పాట ,
మన బతుకులు నిలిపిన ఆట
 నిన్నటి మన బతుకమ్మ ఆట
నేడు బతుకును కోల్పోతుంది ఈ చోట  .

పరాయి వాడు ఉన్నంత కలం
పవిత్రమైన మన పండుగను పట్టించుకోలేదని గళమెత్తి
ప్రచారం కోసం నెత్తిన బతుకమ్మనేత్తి
పట్నాలు అన్ని తిరిగి
పక్క రాష్ట్రాల సంస్కృతిని తెచ్చి
DJ కూతల మోతలతో
డప్పు చప్పుళ్ళను పాతరేసి

కోలాటం చిందుల కోలాహలం తో
చేతి చప్పట్ల సంస్కృతిని సమాది చేస్తూ
బతుకమ్మను బరుబత్ చేస్తూ
నేనచ్చె తెలంగాణాకు బతుకమ్మ నేర్పిన
నేనచ్చే బతుకమ్మకు గుర్తింపు తెచ్చిన అని
 తెగని ప్రచారం చేసుకుంటున్న
తెలంగాణా పెద్దక్క
గిదేనా నువ్వు పెరుస్తున్న   పెద్ద బతుకమ్మ
గిదేనా నువ్వు నేర్పుతున్న గొప్ప సంస్కృతి


నిజమే అక్కో నికే చెందాల్లె  
DJ పాటల మోతలతో
డిసిప్లె లైట్ల చమక్కులతో
పవిత్రమైన మన బతుకమ్మను
పబ్బులో చిందులుగా మార్చిన ఘనత
ప్రత్యేకమైన మనదైన బతుకమ్మను
పరాయికరించిన చరిత్ర
నికె చెందాల్లె అక్క
నిజామాబాద్ ను ఏలుతున్న  పెద్దఅక్క .

రచన
సతీష్ కుమార్ బొట్ల
బొట్లవనపర్తి
కరీంనగర్
9985960614

Botlasjindagi.blogspot.in

Friday 4 August 2017

వాడు –నేను


ఆలోచనలతో అలసి
ఒంటరితనంతో నెరసి
స్తబ్ధంగా, నిశబ్దంగా నేనున్నప్పుడు 
మాటల ప్రవాహమై వాడొస్తాడు
నాలోని అలజడులను తడిమి చూస్తాడు
నా చుట్టుఉన్న నిశబ్దాన్ని చేదించే ప్రయత్నం చేస్తాడు
మాటల్ని మౌనం జయిన్చాకా
మాట్లాడుకోవటానికి ఏముంటుందని 
వాడి మాటల్ని నేను మౌనం చేస్తే 
నా మౌనాన్ని వాడు మననం చేస్తాడు

మౌనం తో సంబాషించగాలిగే మాముందు నిలువాలేక
మౌనం వేరే ప్రపంచంలోకి పారిపోతుంది
మరో ప్రపంచం మా ముందుకు చేరిపోతుంది
ఈ ప్రపంచాన్ని పరిశిలించటం వాడి ఇజం
వాడి పరిశీలనను విశ్లేషించటం నా నైజం
వాడి ఇజం , నా నైజం నుండి పురుడుపోసుకున్న నిజం
నిమురును తోలిగించుకున్న నిప్పు కణలై
నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపే అక్షర కిరణలై
మా నుండి ఈ ప్రపంచం లోకి దుసుకోస్తాయి
మమ్మల్ని ఈ ప్రపంచం నుండి మళ్ళి మాలోకి లక్కోస్తాయి
అప్పుడు
అక్షరాలని కిరణాలుగా వెలిగించిన అలిశెట్టి గురించో
ఆశలకి నిప్పులతో ఊపిరి పోసిన శ్రీ శ్రీ గురించో
జీవితాన్ని శోదించిన జిడ్డు కృష్ణముర్తి గురించో
జీవిత సత్యాన్ని బోదించే భగవద్గీత గురించో
గుండే లోతుల్లోని భావాలను గుమ్మరించి
గుడ్డిడైపోతున్న సమాజం గురించి చింతించి
నిట్టుర్పు నిజాలను తవ్వుతూ
నిర్జీవమైన సమాజానికి ప్రాణాలు పోయాలని తపన పడుతూ
తవ్విన నిజాలను కుప్పలుగా పోసి
తలోదిక్కు బేరీజు వేసుకుంటాము

కాసేపు మౌనం తరువాత
కనులు చూపిన కలల శోధన గురించో
కలత రేపిన అంతర్మదనపు ఆలోచనల గురించో
భారమవుతున్న మధ్యతరగతి బ్రతుకుల గురించో
భాధ్యతవుతున్న బంధాల గురించో
శిధిలమవుతున్న ఆశల గురించో
శిశిరం ఒక్కొకటి గా రాలుస్తున్న ఆకుల్లా
ఆలోచనల్ని జాడించి తెలికవుతున్న తరువుల్లా
మాలోని నిరాశాల్ని నిశీదిలో నిక్షేపితం చేసి
మరో వసంతం కై కలగంటుంటే
అందనంత వేగంతో కాలం పరిగెత్తుతుంటే
ఆ కాలం తోపాటు నిరంతరం మా పయనం సాగుతుంటే
నేను వాడి జీవితంలోకి వెళ్ళానో
వాడె నా జీవితం లోకి వచ్చాడో కానీ
ఈ పుష్కర కాల ప్రయాణం లో మేం నేర్చుకుంది మాత్రం
కలల్ని కనటం
కన్నిళ్ళని కౌగిలించుకోవటం
బాధల్ని భరించటం
బంధాల్ని ప్రేమించటం
సమాజహితం కాంక్షి౦ చాటం
సాహిత్యం లో జీవించటం.
(వాడు వాడిగా కనిపిస్తూ నన్ను నన్నుగా చూడగలిగే నా ఆత్మీయ మిత్రుడు ముద్దసాని శ్రీనివాస్ గురించి )
                                     రచన
                     సతీష్ కుమార్ బొట్ల
                                   9985960614
                          Botlasjindagi.blogspot.in


ఆపకు నీ ప్రయాణం


కలత రేపిన ఆలోచనల అంతర్మధనం లో
కనులు చూపిన కలల శోధనలో
ఆనుబంధాల ఆశృ జల్లులతో
ఆర్పేయకు నీ ఆశయ దీపాలు
ఆత్మీయుల ఆకాంక్షల కోసం                             
అడ్డుకోకు నీ విజయ సోపానాలు

కన్నీళ్ళకు దొరికిపోయేది
కామానికి కరిగి పోయేది
కాలాతితమైన ప్రేమ కాలేదు
ఆవకశాలకు పొంగిపోయేది
ఆశలు చూపిస్తే లొంగి పోయేది
అవిరామ పోరాటం కాలేదు
అనుబంధాల ఊభిలో కురుకుపోతే
అందాల/ ఆనందాల  వలలో చిక్కుకు పోతే
ఆశయా సాధనలో అలుపెరుగని ప్రయాణం చేయలేవు

కారుణ్యతని వొలకబోస్తే  
కన్నీరే కడలై  నిన్ను ముంచేస్తూoది
పట్టు విడుపుల మంత్రాన్ని జపిస్తే
పట్టాలు తప్పే ప్రయాణమై నీ జీవితాన్ని కుల్చేస్తుంది

అందాల / ఆనందాల బంధాల్లో
అనుబంధాల  బంధనాలలో
కాలం ఎప్పుడు కఠినమైనదే
ప్రయాణం ఎప్పుడు జఠిలమైనదే



చీకటి వెలుగుల సంగమం లో
గెలుపోటముల ఆలింగనంలో
నిశిది నీడలను చిలుస్తూ
వెలుగు జాడలను పరుస్తూ
ఆశయం తో కరచలనo చేసేవరకు
ఆపకు నీ పోరాటం
ఆఖరి మజిలి చేరేవరకు
ఆపకు నీ అలుపెరగని ప్రయాణం.
                                ............

రచన
సతీష్ కుమార్ బోట్ల
బొట్లవనపర్తి
కరీంనగర్

9985960614
botlasjindagi.blogspot.in