Saturday 4 May 2013

ఆడది


అఖిల చారాచర సృష్టికి మూలం ఆడది
ఆనంత విశ్వానికి తోరణం ఆడది
అమ్మలా లాలించిన
ప్రేయాసిలా ప్రేమించిన
అక్కల ఆదరించినా
చెల్లిలా చేరదీసిన
అది ఆడదానికే చెల్లింది
తను ఉపిరి బిగపట్టుకొని
మనకు ఉపిరి పోస్తుంది
తన తనువు పుండు అవుతున్న
మన తపనల కింద తలదిండవుతుంది
అలసిన కనులకు నిద్రవుతుంది
ఆకలి తీర్చే అమ్మవుతుంది
అన్ని పంచె అలి అవుతుంది
ఐన
ఆనటి  సీత నుండి ఈనాటి గీత వరకు
మారలేదు ఎ ఆడదాని తలరాత
ఆడది అంటే అభాల కాదు సబల అని చాటిన
అదునిక తరం లోను ....
ఆడది అంటే
అడుగాడుగున అవక్షేపనలే , అవమానలే
అమ్మ కడుపులో అంతిమ సంస్కరాలే
అడుగాడుగున అభద్రతే
అరాచకపు దాడులే
మనం మ్రోక్కేది ఆడదే
మనం అనగత్రోక్కేది ఆడదే
ఐన మరి మన ఆలోచనలో రావటం లేదే అ తేడ అనేది ?.
( స్త్రీలను గౌరవించటం మన సంప్రదాయం .....  స్త్రీలను రక్షించుకోవటం మన కర్తవ్యం ...ఆడవారిపై జరుగుతున్న దాడులను అరికడుదం వారికీ గౌరవమిద్దాం )

                                                        రచన
                                     సతీష్ కుమార్ బోట్ల
                                       బొట్లవనపర్తి
                                        కరీంనగర్                          Botla1987.mygoal@gmail.com                               Botlasjindagi.blogspot.in
                               WWW.jaitelangana.com