Wednesday 17 September 2014

చేతిసంచి


  
మా ఇంట్లో అడుగుపెట్టగానే
చిలుక్కోయ్యకు వేళ్ళాడుతూ
చిరునవ్వుతో పలకరించేది
చేతిసంచి
అవసరం పడిన ప్రతిసారి
ఆత్మీయ కరచలనం చేస్తూ
మా అవసరాలాన్నింటిని
తనలో నింపుకొని నింపాదిగా
ఇంటికి తీసుకొచ్చేది
నాన్నతో సంతకెళ్ళినప్పుడల్లా
సరుకులతో ఉబ్బితబ్బిబ్బై వచ్చేది
సంతలో అది చుసిన వింతలన్నీ
సంతోషంగా / నిశ్శబ్దంగా నాతో చెప్పుకుంటూ
దాని బరువు దించుకునేది
 బడికేళ్తుంటే నా పుస్తకాలూ మోసుకొస్తు
బరువు బాద్యతలు మోయటమే
బతుకు సారాంశం అని నాకు బోదించేది / వివరించేది

చేనుకేళ్ళే అమ్మకి చేదోడు వాదోడుగా
ఊరెళ్ళే బామ్మకి ఉతకర్రగా
బడికెళ్ళే నాతో బాసలాడే స్నేహితుడిగా
మాతో మమేకమై
జనం జీవితాలతో పెనవేసుకుపోయిన
చేతిసంచిప్పుడు మాయమైంది

 

ఆ రోజులు మారాయి
ఆనాటి అలవాట్లు మారాయి
అదునికరణనెపం తో
సాంకేతికాభివృద్ధి సాకులతో
చేతిసంచుల స్తానాన్ని
ప్లాస్టిక్ కవర్లు అక్రమించాయి
ఆయువు పోసే అమృతాన్ని వదులుకొని
ప్రాణం తీసే విషాన్ని కొనుకున్నట్లు
సేవచేసే చేతిసంచిని వదిలేసి
చేటుచేసే ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నాము
అవి మన పురాతన అలవాట్లను నాశనం చేయటమే కాదు
మన ప్రకృతిని కూడా పతనం చేస్తున్నాయి

ఇకనైనా మేల్కొంద్దాం
మన పురాతన అలవాట్లను పునరుద్ధారిద్ధం
ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిద్ధం
పర్యావరణాన్ని కాపాడుకుంద్దాం
పరాయికారించబడిన మనకిదంతా అర్ధం కాదంటే
ఆ పరాయి బాషలోనే ప్రార్దిస్తున్నా
Please carry a bag
Don’t use a carry bag.                   ………07/10/2014

                                                 రచన
                                    సతీష్ కుమార్ బొట్ల
                                        బొట్లవనపర్తి
                                         కరీంనగర్
                                                    9985960614

                                     botla1987.mygoal@gmail.com

                                          botlasjindagi.blogspot.in