Friday 18 October 2019

వెర్రి పిచ్చుకలు


ఆకాశానికి అగ్గిపెట్టి
సెగల పొగలు కమ్మిన
మేఘాల నీడలో
వేడి వేలుగుల జాడలో
నిజాన్ని మరచి
నైజాన్ని వలచి
వెన్నెలని వెతుక్కుంటున్నాయి
వెర్రి పిచ్చుకలు

అడవుల్ని కాల్చి
అరకల్ని పేర్చి
విత్తనాలు పూడ్చి
కడగండ్లు రాల్చి
నేల తడపలేని మేఘాల్ని
నేర్రలు వారిన భూముల్ని
వికశింపచేయాలేమనే విషయాన్నీ మరిచి
వింతగా ప్రవర్తిస్తూన్నాడు వెర్రి మనిషి

కుక్కల్ని తరిమి
నక్కల్ని కూరిమి
సింహాలని దించి
తోడేల్లని గద్దేనేక్కించి
తేనేపూసిన కత్తుల్ని చూస్తూ
తీయ్యటి మాటల్ని వింటూ
తెగ సంబరపడిపోతున్నాయి
తెలివిలేని జంతువులు


వేడి వాడికి రెక్కలు మాడినంక
మంటకి సమిదలు మోసింది తామేనని మరిచి
నిప్పంటించిన చేతిని మాత్రమే
నిందిస్తున్నాయి నిర్లక్ష్యపు పిచ్చుకలు

నేర్రల నేలల్లో నాటిన విత్తనాలు
నాపగింజలుగా మిగిలిపోయాక
నేరం చేసింది తానేనని మరిచి
నేలను నిందిస్తున్నాడు విలువలు మరిచిన మనిషి

నక్కల జిత్తులకి
తోడేళ్ళు దూసిన కత్తులకి
తనువుకి గాయాలు తగిలాక
తముచేసిన తప్పును మరిచి
సింహాన్ని నిందిస్తూన్నాయి చేతకాని జంతువులు


                      రచన
                 సతీష్ కుమార్ బోట్ల
                 బొట్లవనపర్తి
                 9985960614

Wednesday 2 October 2019

జీవనలిజి



పరుగు పరుగున వెళ్తున్న
పట్టి మరి పడేస్తుంది  ప్రతి మలుపు నన్ను
లేచి లేచి  పతంగం ల పైకెగురుతున్న
లాగి లాగి ఆపుతుంది ఈలోకం నన్ను
వేగంగా వేల వేల ఆశలతో పరిగెడుతున్న
వేగం పెంచి మరి దాటేసి వెళ్తుంది  ఈ కాలం నన్ను

కలల్ని దూరంచేసి,
కాళ్ళకి కళ్ళెంవేసి
కలతల్లోనే నన్ను తోసి
కన్నీటి ప్రవాహంతో నన్ను చుట్టేసి
నేటి నుండి నన్ను  రేపటిలోకి వెళ్ళకుoడ
నిన్నటిని నా నుండి  బయటకి వెళ్ళనివ్వకుoడ
నింగికి నేలని మధ్య దూరంలా
నేటికి రేపటికి మద్య దురాన్ని మిగిల్చి
రేపటిని నాకెప్పటికీ ఓ కలలాగే మర్చేస్తుంది
ఓటమిలేని ఈ కాలం
ఓర్వలేని ఈ సమాజం .

ఎదురుదేబ్బలన్ని తట్టుకొని
ఎంత మున్డుకేల్దామన్నగాని
ఒక్క అడుగు కూడా వేయనివ్వకుండా
ఒడిసిపట్టి  నన్ను వెనక్కి లాగుతూoటే ఎదురుగాలి 

అంతం లేని ఆనతంలా
సొంతం కానీ ఆనదంలా
ఫలితం తేలని పరీక్షల
గమ్యం చేరని ప్రయాణంలా
తీరాన్ని దాటని కెరటంలా
తమసిని వదలని తారల్ల
ముందుకు సాగని నావల
మిగిలి పోతూనే ఉంది నా మజిలి
ముగింపు లేని నా జీవనలిజి

                      రచన
                 సతీష్ కుమార్ బోట్ల
                 బొట్లవనపర్తి
                 9985960614