Friday 18 October 2019

వెర్రి పిచ్చుకలు


ఆకాశానికి అగ్గిపెట్టి
సెగల పొగలు కమ్మిన
మేఘాల నీడలో
వేడి వేలుగుల జాడలో
నిజాన్ని మరచి
నైజాన్ని వలచి
వెన్నెలని వెతుక్కుంటున్నాయి
వెర్రి పిచ్చుకలు

అడవుల్ని కాల్చి
అరకల్ని పేర్చి
విత్తనాలు పూడ్చి
కడగండ్లు రాల్చి
నేల తడపలేని మేఘాల్ని
నేర్రలు వారిన భూముల్ని
వికశింపచేయాలేమనే విషయాన్నీ మరిచి
వింతగా ప్రవర్తిస్తూన్నాడు వెర్రి మనిషి

కుక్కల్ని తరిమి
నక్కల్ని కూరిమి
సింహాలని దించి
తోడేల్లని గద్దేనేక్కించి
తేనేపూసిన కత్తుల్ని చూస్తూ
తీయ్యటి మాటల్ని వింటూ
తెగ సంబరపడిపోతున్నాయి
తెలివిలేని జంతువులు


వేడి వాడికి రెక్కలు మాడినంక
మంటకి సమిదలు మోసింది తామేనని మరిచి
నిప్పంటించిన చేతిని మాత్రమే
నిందిస్తున్నాయి నిర్లక్ష్యపు పిచ్చుకలు

నేర్రల నేలల్లో నాటిన విత్తనాలు
నాపగింజలుగా మిగిలిపోయాక
నేరం చేసింది తానేనని మరిచి
నేలను నిందిస్తున్నాడు విలువలు మరిచిన మనిషి

నక్కల జిత్తులకి
తోడేళ్ళు దూసిన కత్తులకి
తనువుకి గాయాలు తగిలాక
తముచేసిన తప్పును మరిచి
సింహాన్ని నిందిస్తూన్నాయి చేతకాని జంతువులు


                      రచన
                 సతీష్ కుమార్ బోట్ల
                 బొట్లవనపర్తి
                 9985960614

No comments:

Post a Comment