Tuesday 5 June 2018

నేటి నిజన్ని – రేపటి స్వపాన్ని / దిగంత ప్రపంచంలోకి ..




కాలం వదిలిన వేడి నిట్టుర్పులతో
కాలి బుడిదైన గతంలోంచి
జ్ఞాపకాల ధూళి రేణువులు
వాయువేగం తో నన్ను చుట్టుముట్టినప్పుడు
నేడులోని నన్ను నేను కోల్పోతుంటాను
నిన్నల్లోకి నిర్దాక్షిణ్యంగా లగాబడుతుంటాను


పతరెసిన పాత స్మృతులని
పలుగు-పార తో తవ్వి వెలికితీసి
అనుభవాల దొంతరలలో  
ఆలోచనలను ఆరబోసుకొని
కొద్ది క్షణాలు
కడవలకొద్దీ కన్నీరు కార్చి
కరిగిపోయిన బాధ విత్తనాన్ని మళ్ళి మొలకెత్తించి
కాలం దూసిన కత్తులకి కొమ్మల్ని కోల్పోయి
శిశిర శుష్క రాగమైన ఒంటరి గీతంల నిల్చుంటాను
మరికొద్ది క్షణాలు  
ఆశాల రెక్కలు విప్పుకు పూసిన పువ్వులపై
ఆనందల చితకొకచిలుకలను ఎగరవేసి
చిరుజల్లులతో తనువును ముద్దాడిన మేఘాలకి
సింగిడి రంగులనద్దిన సంతోషాల కెరటాలని పైకేగారేస్తూ
అనంతలని తనలో దాచుకొని గంబీరంగా ఉన్న సముద్రంల నిల్చుంటాను


కాల గమనంలో
రోజుల లెక్కల్లో
నేడును నిన్నల్లోకి నేట్టివేస్తూ
నిన్నను నేడులోకి లాక్కుంటూ
అనుభవాలకు , ఆలోచనలకూ మధ్య
అనుక్షణం ప్రయాణం చేస్తూ
రేపటి వైపుకు అడుగుల వారది పేరుస్తూ
కొంచెం కొంచెంగా అదృశ్యమవుతున్న
నేటి నిజన్ని నేను
రెక్కల కింద దాచుకున్న నేటి గాయాల్ని
రేపటిలోకి ఎగిరి రానివ్వకుండా
నింగిలోనే నిక్షిప్తం చేస్తున్న
రేపటి స్వప్నాన్ని నేను


నిన్నటికి రేపటికి మధ్య
నిరంతర సంఘర్షణని అనుభవిస్తూ
నేటికి రేపటికి మధ్య
నిత్యం నూతన ఆశాల జీవం పోస్తూ
ప్రాణం ఉన్నంత వరకు కాలం వెంట పరిగెడుతూ
జీవితం ఉన్నంతవరకు దాని గమ్యాన్ని అన్వేషిస్తూ
దిగంతమైన నా  ప్రపంచం లో సాగిపోతూనే ఉంటాను.
                              
                                  రచన
                              సతీష్ కుమార్ బొట్ల .
                                    9985960614
                                 Botlasjindagi.blogspot.in