Friday 18 October 2019

వెర్రి పిచ్చుకలు


ఆకాశానికి అగ్గిపెట్టి
సెగల పొగలు కమ్మిన
మేఘాల నీడలో
వేడి వేలుగుల జాడలో
నిజాన్ని మరచి
నైజాన్ని వలచి
వెన్నెలని వెతుక్కుంటున్నాయి
వెర్రి పిచ్చుకలు

అడవుల్ని కాల్చి
అరకల్ని పేర్చి
విత్తనాలు పూడ్చి
కడగండ్లు రాల్చి
నేల తడపలేని మేఘాల్ని
నేర్రలు వారిన భూముల్ని
వికశింపచేయాలేమనే విషయాన్నీ మరిచి
వింతగా ప్రవర్తిస్తూన్నాడు వెర్రి మనిషి

కుక్కల్ని తరిమి
నక్కల్ని కూరిమి
సింహాలని దించి
తోడేల్లని గద్దేనేక్కించి
తేనేపూసిన కత్తుల్ని చూస్తూ
తీయ్యటి మాటల్ని వింటూ
తెగ సంబరపడిపోతున్నాయి
తెలివిలేని జంతువులు


వేడి వాడికి రెక్కలు మాడినంక
మంటకి సమిదలు మోసింది తామేనని మరిచి
నిప్పంటించిన చేతిని మాత్రమే
నిందిస్తున్నాయి నిర్లక్ష్యపు పిచ్చుకలు

నేర్రల నేలల్లో నాటిన విత్తనాలు
నాపగింజలుగా మిగిలిపోయాక
నేరం చేసింది తానేనని మరిచి
నేలను నిందిస్తున్నాడు విలువలు మరిచిన మనిషి

నక్కల జిత్తులకి
తోడేళ్ళు దూసిన కత్తులకి
తనువుకి గాయాలు తగిలాక
తముచేసిన తప్పును మరిచి
సింహాన్ని నిందిస్తూన్నాయి చేతకాని జంతువులు


                      రచన
                 సతీష్ కుమార్ బోట్ల
                 బొట్లవనపర్తి
                 9985960614

Wednesday 2 October 2019

జీవనలిజి



పరుగు పరుగున వెళ్తున్న
పట్టి మరి పడేస్తుంది  ప్రతి మలుపు నన్ను
లేచి లేచి  పతంగం ల పైకెగురుతున్న
లాగి లాగి ఆపుతుంది ఈలోకం నన్ను
వేగంగా వేల వేల ఆశలతో పరిగెడుతున్న
వేగం పెంచి మరి దాటేసి వెళ్తుంది  ఈ కాలం నన్ను

కలల్ని దూరంచేసి,
కాళ్ళకి కళ్ళెంవేసి
కలతల్లోనే నన్ను తోసి
కన్నీటి ప్రవాహంతో నన్ను చుట్టేసి
నేటి నుండి నన్ను  రేపటిలోకి వెళ్ళకుoడ
నిన్నటిని నా నుండి  బయటకి వెళ్ళనివ్వకుoడ
నింగికి నేలని మధ్య దూరంలా
నేటికి రేపటికి మద్య దురాన్ని మిగిల్చి
రేపటిని నాకెప్పటికీ ఓ కలలాగే మర్చేస్తుంది
ఓటమిలేని ఈ కాలం
ఓర్వలేని ఈ సమాజం .

ఎదురుదేబ్బలన్ని తట్టుకొని
ఎంత మున్డుకేల్దామన్నగాని
ఒక్క అడుగు కూడా వేయనివ్వకుండా
ఒడిసిపట్టి  నన్ను వెనక్కి లాగుతూoటే ఎదురుగాలి 

అంతం లేని ఆనతంలా
సొంతం కానీ ఆనదంలా
ఫలితం తేలని పరీక్షల
గమ్యం చేరని ప్రయాణంలా
తీరాన్ని దాటని కెరటంలా
తమసిని వదలని తారల్ల
ముందుకు సాగని నావల
మిగిలి పోతూనే ఉంది నా మజిలి
ముగింపు లేని నా జీవనలిజి

                      రచన
                 సతీష్ కుమార్ బోట్ల
                 బొట్లవనపర్తి
                 9985960614

Thursday 12 September 2019

నడక



నడక ఎప్పుడో ఒక్కప్పుడు
ఆగిపోవలసిందే
అవిశ్రాంతంగా నడిచిన పాదాల ప్రయాణం
ఎక్కడో ఒక్కదగ్గర
నిలిచిపోవలిసిందే
నడిచిన దారుల్లో
                 ఆడుగుల ఆనవాళ్ళు
శాశ్వతంగా నిలువలేవు

పూలబాట కొంత
ముళ్ళబాట కొంత
దారిదేముంది
సాగిపోతూనే ఉంటుంది
నువ్వు నడక నేర్పినవాడే
నువ్వు నడవలేని స్థితిలో
నిన్నొదిలేసి వెళ్ళిపోతుంటే
అలసటతోనైనా
 అనివార్యంగానైన
అడుగుల కదలిక ఆపాల్సిందే

కొంగది ఏముంది
చేరువు ఎండిపోగానే
చేట్టుమిదికి వెళ్ళిపోతుంది
కోకిలది ఏముంది
మాఘమాసం ముగిసిపోగానే
మౌనరాగం అందుకుంటుంది
అవసరం తీరాక
అంత సర్దుకోవాల్సిందే
నాటకం ముగిసాక
నటన ఆపివేయాల్సిందే


తోలకరిది ఏముంది
తరువు తపనలను
తడమకుండానే ఆవిరై పోవచ్చు
మట్టి పరిమళాలది ఏముంది
ముక్కు పుటలను
తాకకుండానే ముగిసిపోవచ్చు
కష్టపడి పెంచిన తోటకు
కసాయివాడు కాపరి కావొచ్చు
ఇష్టపడి నడిచిన దారిలో
ఉహించని మలుపులే ఎదురవ్వొచ్చు
కలలు కన్నా తీరం చేరకముందే
కాలంతో నీ ప్రయాణం ముగిసి పోవచ్చు

ఎంత విరబూసిన
ఎదో ఒక్క వేళ
చెట్టు ఆకుల్ని రాల్చల్సిందే
ఎంత ఎగిసిన
కెరటం ఎదోచోట
తీరాన్ని తాకి ఆగాల్సిందే
గతందేముంది
జ్ఞాపకమై మిగాలల్సిందే
మనిషిదేముంది
మరణాన్ని వెంటేసుకొని తీర్గాల్సిందే

జీవితనికేముంది
ఒక్క మొదలు ,
ఒక్క ముగింపు
రెండింటిని కలిపేదే నడక.

                             రచన 
                     సతీష్ కుమార్ బొట్ల
                                            9985960614
                                               botlasjindagi.blogspot.in 

Wednesday 6 February 2019

నేను –మీరు


నేనొక తారజువ్వై
నిప్పులు చిమ్ముతూ
నింగికేగిరిపోతుంటే
 నిశ్శబ్దంగా చూస్తూ మీరురుకుంటరా?
అసూయా కన్నీళ్ళు కార్చి
ఆకాశంనుండి నన్ను క్రిందికి దించేయారు!

నేనొక పదునైన గుణపమై
పాతాళం లోతుల్ని కోలిచేందుకు పయనమైతే
ప్రశాంతంగా చూస్తూ మీరురుకుంటరా?
పలుగురాళ్ళ పరుపై పరుచుకుని
పైపైకి నన్నేగిరేయారు!

                          నేనొక నావనై
అలాల్ని చీల్చుకుంటూ
అవతలి తీరంవైపు సాగుతుంటే
 ఆశ్చర్యంతో  చూస్తూ మీరురుకుంటరా?
 సునామీయై చుట్టుముట్టి
సముద్రంలో నన్నుకలిపెయారు!

నేనొక పరుసవేదినై
ఇసుక తిన్నేల్ని పసిడి గిన్నేలుగా
ప్రతిసృష్టి చేస్తుంటే
సానుకూలంగా చూస్తూ మీరురుకుంటరా?
సైకత తుపానై
నా సమాస్తాన్ని సర్వనాశనం చేయారు!!
                 
రచన
          సతీష్ కుమార్ బొట్ల .
                                                  9985960614
                                          Botlasjindagi.blogspot.in