Thursday 12 September 2019

నడక



నడక ఎప్పుడో ఒక్కప్పుడు
ఆగిపోవలసిందే
అవిశ్రాంతంగా నడిచిన పాదాల ప్రయాణం
ఎక్కడో ఒక్కదగ్గర
నిలిచిపోవలిసిందే
నడిచిన దారుల్లో
                 ఆడుగుల ఆనవాళ్ళు
శాశ్వతంగా నిలువలేవు

పూలబాట కొంత
ముళ్ళబాట కొంత
దారిదేముంది
సాగిపోతూనే ఉంటుంది
నువ్వు నడక నేర్పినవాడే
నువ్వు నడవలేని స్థితిలో
నిన్నొదిలేసి వెళ్ళిపోతుంటే
అలసటతోనైనా
 అనివార్యంగానైన
అడుగుల కదలిక ఆపాల్సిందే

కొంగది ఏముంది
చేరువు ఎండిపోగానే
చేట్టుమిదికి వెళ్ళిపోతుంది
కోకిలది ఏముంది
మాఘమాసం ముగిసిపోగానే
మౌనరాగం అందుకుంటుంది
అవసరం తీరాక
అంత సర్దుకోవాల్సిందే
నాటకం ముగిసాక
నటన ఆపివేయాల్సిందే


తోలకరిది ఏముంది
తరువు తపనలను
తడమకుండానే ఆవిరై పోవచ్చు
మట్టి పరిమళాలది ఏముంది
ముక్కు పుటలను
తాకకుండానే ముగిసిపోవచ్చు
కష్టపడి పెంచిన తోటకు
కసాయివాడు కాపరి కావొచ్చు
ఇష్టపడి నడిచిన దారిలో
ఉహించని మలుపులే ఎదురవ్వొచ్చు
కలలు కన్నా తీరం చేరకముందే
కాలంతో నీ ప్రయాణం ముగిసి పోవచ్చు

ఎంత విరబూసిన
ఎదో ఒక్క వేళ
చెట్టు ఆకుల్ని రాల్చల్సిందే
ఎంత ఎగిసిన
కెరటం ఎదోచోట
తీరాన్ని తాకి ఆగాల్సిందే
గతందేముంది
జ్ఞాపకమై మిగాలల్సిందే
మనిషిదేముంది
మరణాన్ని వెంటేసుకొని తీర్గాల్సిందే

జీవితనికేముంది
ఒక్క మొదలు ,
ఒక్క ముగింపు
రెండింటిని కలిపేదే నడక.

                             రచన 
                     సతీష్ కుమార్ బొట్ల
                                            9985960614
                                               botlasjindagi.blogspot.in