Monday 26 February 2018

స్మశానం

                          

                          అయినవాళ్ళు కడసారి కన్నీళ్ళు కార్చక
                  ఆకరి అనుభవాల అంతిమయాత్ర ముగిశాక
హృదయం లేని ఆకారాలు
ప్రాణంలేని అస్థిపంజరాలు
దహించి వేయబడుతున్న మృత దేహాలు
ధరణిలో పుడ్చాబడుతున్న శవాలు
అంత ఇక్కడ సమానమే

అంబరాన్ని తకినవాడికైన
అధ:పాతాళంలోకి చేరిన వాడికైన
అధికార దర్పం చూపించిన వాడికైన
అణిగి మణిగి బ్రతికిన వాడికైన
ఆకరి మజిలి చేరువయ్యకా
అంతిమయాత్ర మొదలయ్యాకా
పల్లాకిలో మోసుకువచ్చిన
పాడెపై ఎత్తుకువచ్చిన
గంధం చేక్కల్లో కాల్చిన
గుంతతీసి పూడ్చిన
ఇక్కడేవ్వరైన జీవన గమ్యాన్ని చేరుకోవాల్సిందే
జీవిత సత్యాన్ని అవగతం చేసుకో వాల్సిందే

                    ఇక్కడ ధనిక పేద బేధాలులేవు
                    ఆడ-మగ తేడాలు లేవు
                    కుల మతాల బెషాజాలు లేవు
                    ఉత్తముడు , నీచుడానే నీతి సూత్రాలు లేవు
                    జాత్యహంకార అదిప్యత అణిచివేతలు లేవు
                    రాజకీయ కుట్రలు కుతంత్రాలు లేవు
                    ఇక్కడేవ్వరైన మరణాన్ని గానం చేయాల్సిందే
                     వొరిగిన ప్రాణానికి శోకాభిషేకం చేయాల్సిందే

                    
                       ఊరుకన్నా స్మశానమే నయ్యం
                      ఊరులో తారతమ్యాలకు చోటుంటుంది
                      స్మశానంలో సమానత్వానికి చోటుంటుంది
                       కాని ఉరులోనే స్మశానానికిప్పుడు చోటులేదు .



                                                               రచన
                                                        సతీష్ కుమార్ బొట్ల
                                                     బొట్లవనపర్తి
                                                         9985960614

                         Botlasjindagi.blogspot.in

Saturday 17 February 2018

జ్ఞాపకాల పుస్తకపు ముఖచిత్రం



నేస్తం
నేను దాచిన నీ ఉత్తరం
నా జ్ఞాపకాల పుస్తకపు ముఖచిత్రం 
మన స్నేహం లోని మదురమైన జ్ఞాపకాల ప్రతిక
మన స్నేహంలోని క్షణాల్ని నాకు మళ్ళి చూపే జ్ఞాపిక

నేస్తం
నిరంతరం నీ ఉహాలు నన్ను వెంటాడినప్పుడు
నువ్వు లేవనే నిజం నన్ను భాదించినప్పుడు
నీ ఉత్తరంలోని అక్షరాలు
నాకు స్వంతననిచ్చే నీ ఆత్మీయ పలకరింపులు

నేస్తం
నీ నోట నా పేరు వినాలనిపించినప్పుడు
నీతో మన కాలేజి రోజులను నెమరు వేసుకోవాలనిపించినప్పుడు
ఆ ఉత్తరంలో  మొదట నువ్వు రాసిన నా పేరు చదువుతుంటే
ఆత్మీయంగా నువ్వు నన్ను నోరుతెరచి పిలుస్తూన్నట్లుంటుంది
ఆ ఉతరాన్ని ఆర్ధత తో సృశిస్తూoటే
ఆ క్షణంలో నువ్వు నా భుజాలపై చేతులేసి నడుస్తూన్నట్లుంటుంది

నేస్తం
నేనే నీ ప్రాణ మిత్రుడినoటునే
నన్ను ఈ లోకం లో ఒంటరిగా వదిలేసి
నీ స్నేహాన్ని మాత్రమే నాకు మిగిలించి
నీ ప్రాణాల్ని మాత్రం నువ్వే తీసుకెళ్ళిపోయావు
ప్రాణం లాంటి నిన్ను పోగొట్టుకున్న
ప్రాణం కన్నా ఎక్కువగా ఈ ఉతరాన్ని దాచుకున్న
అందుకే
నేను దాచిన నీ ఈ ఉత్తరం
నా జ్ఞాపకాల పుస్తకపు ముఖచిత్రం.

(నా ఆత్మీయ మిత్రుడు కీ.శే .నల్ల సందీప్ రెడ్డి  రాసిన ఉత్తరం .... వాని జ్ఞాపకాల యాదిలో)

                                                               రచన
                                                           సతీష్ కుమార్ బొట్ల

                                                                           9985960614

Friday 16 February 2018

సమ్మక్క / స్పూర్తి మాత

పోరుబాటలో అడుగుజాడలు
చరిత్ర పుటల్లో స్పూర్తి  ప్రదాతలు
చావును దిక్కరించిన పోరుబిడ్డలు
ఆత్మగౌరవ ప్రతీకలైన అడవి బిడ్డలు
మన సమ్మక్క – సారలక్కలు 

మాఘ శుద్ధ  పౌర్ణమి నాడు మహా అడవిలో
మృగరాజులతో ఆటలాడిన సహస బాలిక సమ్మక్కవై
మేడరాజు మేలిమి పుత్రికవైనావు
మేడారం నది తీరాన పగిడిద్దరాజును పరిణయమాడి
సారలమ్మ , నాగులమ్మ , జంపన్నలకు జన్మనిచ్చి
సహసన్నే ఉపిరిగా నింపిన తల్లివైనావు

కరువు కాటకాలతో విలవిలలాడుతున్న కోయరాజ్యం పై
కప్పం పేరుతో కత్తి దూసిన కాకతీయులతో
కదనరంగంలో కాలుదువ్వి
దైర్య సాహసాలతో పోరుజరిపి
దేవరగట్టు చిలకల గుట్టలో
దైవం ప్రతిరూపమైన పసుపు- కుంకుమవై వేలిసితివి
పచ్చని అడవిని పాలించే తల్లివై నిలిచితివి
కొండ కోనల్లో కొలువై
కోయాల కష్టాలు తీర్చే కోవేల వైతివి
జనం గుండెల్లో నెలవై
జగమంత పాలించే తల్లివైతివి


బక్కయ్య పేటలో కొంగుబంగారంతో మొదలై
మేడారం మహా జాతరగా విశ్వవ్యాప్తమై
వనమంత జనమయ్యే వరకు సాగిన మహా ప్రయాణం లో
ఘనమైన కీర్తితో ప్రపంచపు గద్దేనేక్కితివి
ప్రపంచ ఖ్యాతిలో ప్రఖ్యాతివైతివి
ఆత్మగౌరవానికి ప్రతీకవైతివి
మాలో చైతన్యం రగిలించే సమర గీతికవైతివి
మాలో దైర్యం నిపే దేవతమూర్తి వైతివి
తల్లి సమ్మక్క
మహోన్నతమైన నీ కీర్తి

మమ్మల్ని నిరంతరం ముందుకు నడిపే స్ఫూర్తి.

                                        రచన
                                                 సతీష్ కుమార్ బొట్ల
                                                                 9985960614