Friday 16 February 2018

సమ్మక్క / స్పూర్తి మాత

పోరుబాటలో అడుగుజాడలు
చరిత్ర పుటల్లో స్పూర్తి  ప్రదాతలు
చావును దిక్కరించిన పోరుబిడ్డలు
ఆత్మగౌరవ ప్రతీకలైన అడవి బిడ్డలు
మన సమ్మక్క – సారలక్కలు 

మాఘ శుద్ధ  పౌర్ణమి నాడు మహా అడవిలో
మృగరాజులతో ఆటలాడిన సహస బాలిక సమ్మక్కవై
మేడరాజు మేలిమి పుత్రికవైనావు
మేడారం నది తీరాన పగిడిద్దరాజును పరిణయమాడి
సారలమ్మ , నాగులమ్మ , జంపన్నలకు జన్మనిచ్చి
సహసన్నే ఉపిరిగా నింపిన తల్లివైనావు

కరువు కాటకాలతో విలవిలలాడుతున్న కోయరాజ్యం పై
కప్పం పేరుతో కత్తి దూసిన కాకతీయులతో
కదనరంగంలో కాలుదువ్వి
దైర్య సాహసాలతో పోరుజరిపి
దేవరగట్టు చిలకల గుట్టలో
దైవం ప్రతిరూపమైన పసుపు- కుంకుమవై వేలిసితివి
పచ్చని అడవిని పాలించే తల్లివై నిలిచితివి
కొండ కోనల్లో కొలువై
కోయాల కష్టాలు తీర్చే కోవేల వైతివి
జనం గుండెల్లో నెలవై
జగమంత పాలించే తల్లివైతివి


బక్కయ్య పేటలో కొంగుబంగారంతో మొదలై
మేడారం మహా జాతరగా విశ్వవ్యాప్తమై
వనమంత జనమయ్యే వరకు సాగిన మహా ప్రయాణం లో
ఘనమైన కీర్తితో ప్రపంచపు గద్దేనేక్కితివి
ప్రపంచ ఖ్యాతిలో ప్రఖ్యాతివైతివి
ఆత్మగౌరవానికి ప్రతీకవైతివి
మాలో చైతన్యం రగిలించే సమర గీతికవైతివి
మాలో దైర్యం నిపే దేవతమూర్తి వైతివి
తల్లి సమ్మక్క
మహోన్నతమైన నీ కీర్తి

మమ్మల్ని నిరంతరం ముందుకు నడిపే స్ఫూర్తి.

                                        రచన
                                                 సతీష్ కుమార్ బొట్ల
                                                                 9985960614

No comments:

Post a Comment