Friday 28 December 2018

రైతు అనే రాజు




మట్టికి మనిషికి మధ్య దురాన్ని చేరిపెందుకు
నిగికి నెలకు మధ్య దురాన్ని కలిపేసి
వానలో తడిచి
మట్టిలో మొలిచి
ఎండలో మేరిసి
చేనులో పచ్చని పైరై నిలిచి
ఆరుకాలపు ఆకలి కడుపుల
అతుకుల గతుకుల బతుకుల
పల్లెల రైతులు చిందించిన శ్వేదం చినుకులు
పట్నం కడుపుల ఆకలి తీర్చే పళ్ళెంలోని  మెతుకులు


నాగలితో నాగరికతను నేరిపి
పుడమి తల్లికి పురుడుపోసి
తనలోని నెత్తురునంత ఎరువు చేసి
తనలోని సత్తువనంత దారబోసి
దన్యారాశులను కుప్పలుగాపోసిన
"అన్నదాతై” మన ఆకలికి అడ్డుకట్ట వేసిన
‘’వ్యవసాయం’’తోనే ఈ ప్రపంచానికి సాయం నేర్పిన
రైతులు  నేడు
దళారుల చేతుల్లో కీలు బొమ్మగా  చిక్కి
బారువడ్డీలతో బ్రతుకులు బంది అవుతున్న
చక్రవడ్డిలతో  జీవితాలు చిద్రం అవుతున్న
చేయూతనివ్వాల్సిన ప్రభుత్వాలే
“రైతే రాజు” అంటూ చేతులు దులుపుకుoటుంటే
కాలం కన్నాబిడ్డై
కష్టాల దత్త పుత్రుడై
మన ఆకలి తీర్చేందుకు
మట్టితో మమేకమై సాగుజరుపుతున్న
రైతు ఎప్పుడు రాజే ఎందుకంటే
రాజు అంటే పాలించేవాడు కాదు
పోషించేవాడు కాబట్టి
రాజు అంటే తన ఆకాలిని చంపుకొని
దేశ ప్రజల ఆకాలిని తీర్చేవాడు కాబట్టి
రైతే రాజు


రాజు లేని రాజ్యాలను ఎలాలనే వెర్రి ఆశతో
రాజ్యపు వెన్నుముకలను విరిచేస్తున్న
దళారి సామంతులతో దోస్తీ చేస్తున్న
దౌర్భాగ్యపు రాజకీయ వ్యావస్థలో
ఆకలికి మాత్రం నోరు తెరుస్తూ
ఆన్యాయాన్ని ప్రశ్నించ లేని గొంతుకలు
అన్నదాతను సమాది చేసే ప్రయత్నంలో
తమో పిడికెడు మట్టిని సాయం చేస్తూ
నగరికరణ అనే నాగాలినే రైతుకు శిలువగావేసి
నాగరికత ముసుగులో దేశపు వెన్నుముకలను విరిచేస్తూ
ప్రపంచ పతనానికి దారులేస్తూ
“సాగు” పై సానుభూతి కురిపిస్తున్న ఈ సమాజం
ఇప్పటికి తెలుసుకోలేకపోతుంది
రేపటితరం ఆకలి ఆగ్రహాన్ని తీర్చేందుకు
విరిగిపోతున్న దేశపు వెన్నుముకను అతికిన్చేందుకు
ఎందరు దళారులున్న సరిపోరని
ఎందరు పాలకులు వచ్చిన సరిరారని
ఒక్క రాజు తప్ప
రాజానే రైతుతప్ప .


                  రచన
        సతీష్ కుమార్ బొట్ల .
                                             9985960614
                                    Botlasjindagi.blogspot.in

Thursday 20 December 2018

జీవనాకృతి


ప్రపంచం గర్జించింది నాపైకి
నేను మౌనం వహిoచినప్పుడు
ఓటమి గెలుపొందింది నాపై
నేను విజయాన్ని వదులుకున్నప్పుడు
ఎందుకు
ఉద్గార కిరణమై
తమసిని చిల్చాలనే కాంక్షను
ఉదుత్త తరంగమై
నిగిని తాకాలనే తపనను
నేను పోదిమి పట్టికోలేదనా
లేక ప్రసారించే కిరణాన్ని
తనలో కలిపెసుకునే నిషిది ప్రయత్నాన్ని
నింగికేగిసే కెరటాన్ని నిరంతరం
తనలోకి లాక్కునే సాగరం పట్టుదలని
నేను గమనిoచ లేకపోవటం వలనా?

కారణం ఏదైనా కావొచ్చు
ఆ కారణo ఆకారనoగా నన్ను
బలి తీసుకోవచ్చు
తామసిలో వీలినమైన కిరణం
మళ్ళి తళ్ళుక్కుమంటుంది
పడిన కెరటం మళ్ళి పైకేగురుతుంది
కాలం కటేసిన నాడు
కాలగర్భంలో కలిసిన చరిత్ర కూడా
కాలo వెన్నుతట్టినప్పుడు
భూమి పొరల్ని చీల్చుకుంటూ
నిత్య నూతనంగా వేలికొస్తుంది
అప్పుడు ఈ ప్రపంచం
ముగాబోతుంది నాముందు
ఈదే  ఓటమి మోకరిల్లుతుంది
నా పాదల ముందు
అదే ప్రకృతి
అదే జీవనాకృతి
ఇదే జీవితం
జీవించటం తెలిసిన వాడికి
ఇదే జీవిత పరమార్ధం
జీవితాన్ని అవగతం చేసుకున్నవాడికి 


               రచన
        సతీష్ కుమార్ బొట్ల .
                                                  9985960614
                                         Botlasjindagi.blogspot.in

Monday 23 July 2018

నేనే


       నేనే 

కలని నేనే కలతని నేనే
కలకి , కలతకి మధ్య
కదిలే కాలాన్ని నేనే
ఆలోచన నేనే
అంతరంగం నేనే
ఆలోచన , అంతరంగాల మధ్య
అంతర్యుద్దాన్ని నేనే
పుట్టుక నాదే  చావు నాదే
చావు , పుట్టుకల మధ్య
సాగుతున్న ఈ జీవితం నాదే
నేను నేనే
నేను కాని నేనే
నేనైనా నేనుకాని
మరోవ్వరో నేనే
సమస్తం నేనే
సమాప్తం నేనే .

               రచన
        సతీష్ కుమార్ బొట్ల .
                                                  9985960614
                                         Botlasjindagi.blogspot.in


Tuesday 5 June 2018

నేటి నిజన్ని – రేపటి స్వపాన్ని / దిగంత ప్రపంచంలోకి ..




కాలం వదిలిన వేడి నిట్టుర్పులతో
కాలి బుడిదైన గతంలోంచి
జ్ఞాపకాల ధూళి రేణువులు
వాయువేగం తో నన్ను చుట్టుముట్టినప్పుడు
నేడులోని నన్ను నేను కోల్పోతుంటాను
నిన్నల్లోకి నిర్దాక్షిణ్యంగా లగాబడుతుంటాను


పతరెసిన పాత స్మృతులని
పలుగు-పార తో తవ్వి వెలికితీసి
అనుభవాల దొంతరలలో  
ఆలోచనలను ఆరబోసుకొని
కొద్ది క్షణాలు
కడవలకొద్దీ కన్నీరు కార్చి
కరిగిపోయిన బాధ విత్తనాన్ని మళ్ళి మొలకెత్తించి
కాలం దూసిన కత్తులకి కొమ్మల్ని కోల్పోయి
శిశిర శుష్క రాగమైన ఒంటరి గీతంల నిల్చుంటాను
మరికొద్ది క్షణాలు  
ఆశాల రెక్కలు విప్పుకు పూసిన పువ్వులపై
ఆనందల చితకొకచిలుకలను ఎగరవేసి
చిరుజల్లులతో తనువును ముద్దాడిన మేఘాలకి
సింగిడి రంగులనద్దిన సంతోషాల కెరటాలని పైకేగారేస్తూ
అనంతలని తనలో దాచుకొని గంబీరంగా ఉన్న సముద్రంల నిల్చుంటాను


కాల గమనంలో
రోజుల లెక్కల్లో
నేడును నిన్నల్లోకి నేట్టివేస్తూ
నిన్నను నేడులోకి లాక్కుంటూ
అనుభవాలకు , ఆలోచనలకూ మధ్య
అనుక్షణం ప్రయాణం చేస్తూ
రేపటి వైపుకు అడుగుల వారది పేరుస్తూ
కొంచెం కొంచెంగా అదృశ్యమవుతున్న
నేటి నిజన్ని నేను
రెక్కల కింద దాచుకున్న నేటి గాయాల్ని
రేపటిలోకి ఎగిరి రానివ్వకుండా
నింగిలోనే నిక్షిప్తం చేస్తున్న
రేపటి స్వప్నాన్ని నేను


నిన్నటికి రేపటికి మధ్య
నిరంతర సంఘర్షణని అనుభవిస్తూ
నేటికి రేపటికి మధ్య
నిత్యం నూతన ఆశాల జీవం పోస్తూ
ప్రాణం ఉన్నంత వరకు కాలం వెంట పరిగెడుతూ
జీవితం ఉన్నంతవరకు దాని గమ్యాన్ని అన్వేషిస్తూ
దిగంతమైన నా  ప్రపంచం లో సాగిపోతూనే ఉంటాను.
                              
                                  రచన
                              సతీష్ కుమార్ బొట్ల .
                                    9985960614
                                 Botlasjindagi.blogspot.in

Wednesday 9 May 2018

మిగిలింది..!




ఆక్షర నక్షత్రాల మీదనుండి
ఆశాలు జారి పడ్డప్పుడు
కలల మేడలు కూలి
కన్నీటి జాడలై నిలిచినప్పుడు
నమ్ముకున్న కలల్ని అమ్ముకోలేక
ఆత్మసంతృప్తినిచ్చే ఆశయాన్ని వదులుకోలేక
కలలకి, కన్నీళ్ళకి మధ్య
ఆశయాలకి , ఆదర్శాలకి మధ్య
అనుక్షణం సంఘర్షణలో అలసిన దేహాన్ని
అంపశయ్య లాంటి పక్కపైకి చేర్చి
కనుపాపలపై పరుస్తున్న నిద్ర దుప్పటిని
కర్కషంగ లాగేస్తున్నాయి కల్లోలపు ఆలోచనలు


వెన్నెల జల్లుల్లో వెలుగుతున్న పచ్చని ప్రకృతిని
వెచ్చని దావాగ్ని దాహించివేస్తూన్నట్లు
నిచ్చలమైన నీటితో స్తబ్ధంగా ఉన్న బావిలో
నిశబ్దాన్ని చేదిస్తూ బండరాళ్ళు దోర్లినట్లు
హృదయపు గదుల్లో నింపుకున్న ఉపిరి
ఉప్పెనై నన్ను ముంచేస్తూన్నట్లు
కన్నుల్లోని అందమైన కలలు
కన్నిరై కరిగిపోతున్నాయి



కలలో కన్నీళ్ళో ఏవైతేనేం
కాలంతోపాటే కరిగిపోయాక
నిజమో , నిద్రో ఏదైతేనేమి
నీ జీవితమే నిన్ను భయపెట్టక
జననమో , మరణమో ఏదైతేనేం
ఉపిరి మీదే ఆదారపడ్డక
గెలుపో ఓటమో ఏదైతేనేమి
ప్రయత్నం ముగిసి పోయాక
ఇప్పుడు చేయాల్సింది
పలితల విశ్లేషణ కాదు
ప్రయాణ౦ మాత్రమే
సాదించింది ఏదైనా
సాదిన్చాలిసింది ఏమైనా  
ఇప్పుడు మిగిలింది
జీవించటం మాత్రమే
జీవితాన్ని అనుభవించటం మాత్రమే.


                                                 రచన
                                    సతీష్ కుమార్ బోట్ల.
                                      బొట్లవనపర్తి
                                        కరీంనగర్
                                   Cell:9985960614
                   Botlasjindagi.blogspot.in