Friday 28 December 2018

రైతు అనే రాజు




మట్టికి మనిషికి మధ్య దురాన్ని చేరిపెందుకు
నిగికి నెలకు మధ్య దురాన్ని కలిపేసి
వానలో తడిచి
మట్టిలో మొలిచి
ఎండలో మేరిసి
చేనులో పచ్చని పైరై నిలిచి
ఆరుకాలపు ఆకలి కడుపుల
అతుకుల గతుకుల బతుకుల
పల్లెల రైతులు చిందించిన శ్వేదం చినుకులు
పట్నం కడుపుల ఆకలి తీర్చే పళ్ళెంలోని  మెతుకులు


నాగలితో నాగరికతను నేరిపి
పుడమి తల్లికి పురుడుపోసి
తనలోని నెత్తురునంత ఎరువు చేసి
తనలోని సత్తువనంత దారబోసి
దన్యారాశులను కుప్పలుగాపోసిన
"అన్నదాతై” మన ఆకలికి అడ్డుకట్ట వేసిన
‘’వ్యవసాయం’’తోనే ఈ ప్రపంచానికి సాయం నేర్పిన
రైతులు  నేడు
దళారుల చేతుల్లో కీలు బొమ్మగా  చిక్కి
బారువడ్డీలతో బ్రతుకులు బంది అవుతున్న
చక్రవడ్డిలతో  జీవితాలు చిద్రం అవుతున్న
చేయూతనివ్వాల్సిన ప్రభుత్వాలే
“రైతే రాజు” అంటూ చేతులు దులుపుకుoటుంటే
కాలం కన్నాబిడ్డై
కష్టాల దత్త పుత్రుడై
మన ఆకలి తీర్చేందుకు
మట్టితో మమేకమై సాగుజరుపుతున్న
రైతు ఎప్పుడు రాజే ఎందుకంటే
రాజు అంటే పాలించేవాడు కాదు
పోషించేవాడు కాబట్టి
రాజు అంటే తన ఆకాలిని చంపుకొని
దేశ ప్రజల ఆకాలిని తీర్చేవాడు కాబట్టి
రైతే రాజు


రాజు లేని రాజ్యాలను ఎలాలనే వెర్రి ఆశతో
రాజ్యపు వెన్నుముకలను విరిచేస్తున్న
దళారి సామంతులతో దోస్తీ చేస్తున్న
దౌర్భాగ్యపు రాజకీయ వ్యావస్థలో
ఆకలికి మాత్రం నోరు తెరుస్తూ
ఆన్యాయాన్ని ప్రశ్నించ లేని గొంతుకలు
అన్నదాతను సమాది చేసే ప్రయత్నంలో
తమో పిడికెడు మట్టిని సాయం చేస్తూ
నగరికరణ అనే నాగాలినే రైతుకు శిలువగావేసి
నాగరికత ముసుగులో దేశపు వెన్నుముకలను విరిచేస్తూ
ప్రపంచ పతనానికి దారులేస్తూ
“సాగు” పై సానుభూతి కురిపిస్తున్న ఈ సమాజం
ఇప్పటికి తెలుసుకోలేకపోతుంది
రేపటితరం ఆకలి ఆగ్రహాన్ని తీర్చేందుకు
విరిగిపోతున్న దేశపు వెన్నుముకను అతికిన్చేందుకు
ఎందరు దళారులున్న సరిపోరని
ఎందరు పాలకులు వచ్చిన సరిరారని
ఒక్క రాజు తప్ప
రాజానే రైతుతప్ప .


                  రచన
        సతీష్ కుమార్ బొట్ల .
                                             9985960614
                                    Botlasjindagi.blogspot.in

No comments:

Post a Comment