Saturday 16 December 2017

కాలం నా సహచరి


అణువు నుండి నేను ఆకారం పోసుకున్న క్షణం నుండి
అమ్మ ఒళ్ళో నుండి అవని ఒళ్లోకి చేరినప్పటినుండి
ఆమె తో నా ప్రయాణం ( సహచర్యం)  మొదలైంది  
ఉగ్గు పాలు  తాగుతూ ఉయాలలు ఉగుతున్న క్షణానా
ఉంగ ఉంగ అంటూ నిశ్శబ్దం తో ముచ్చటిస్తున్నా క్షణ నా
పాకుతూ పొర్లుతూ పసిడి నవ్వులు రువ్వుతున్న క్షణాo లో
పడుతూ లేస్తూ పరుగులు నేర్చుకుంటున్న క్షణం లో
ఆమె నా సహచరి

అమ్మ ఒడి వదిలి అక్షరం తో స్నేహం చేస్తున్నవేళా
అమాయకపు రెక్కలు తొడుక్కొని ఆశల లోకంలోకి ఎగురుతున్నవేళా
ని౦గి అంచులని తాకాలని నూతన కలాల్ని ప్రోగు చేసుకుంటున్న వేళా
ఆశలు అడిఆశలవుతాయని తెలుసుకుంటున్న మొదటి క్షణం లో
కలలు కల్లోలాన్ని మిగిలిస్తాయాని నేర్చుకుంటున్న క్షణం లో
నాన్న వేలు వదిలి నవ యవ్వనం లోకి అడుగు పెడుతున్నవేళ
పరువపు  ప్రవాహంలో మునిగి తేలుతున్న వేళా
ప్రణయ విఫల వేదనతో మనస్సు రోదిస్తున్న వేళా
ఆమె నా సహచరి

ఆలోచనలకు పదునుపెడుతూ ఆశయాలకై పరిగెడుతున్న క్షణo లో
ఆత్మ విశ్వాసం తో అవరోదాల్ని అదిగామిస్తున్న క్షణం లో
గెలుపు ఓటములను విశ్లేషించుకుంటున్న క్షణం లో
గాయాలని గేయాలుగా గానం చేసుకుంటున్న వేళా
ఆరాటం  , పోరాటాల ల మధ్య తేడాను బేరీజు వేసుకుంటున్న వేళా
ఆశ నిరాశ లని నాలోన నిక్షిప్తం చేసుకుంటున్న వేళా
ఆమె నా సహచరి 

జీవిత గమ్యాన్ని నిర్దేశిoచుకుంటున్న వేళా
జీవన సహచరిణి చేరుకుంటున్న వేళా
జీవన మదూర్యాన్ని చవిచూస్తున్న వేళా
జీవన వైపల్యాన్ని జీర్ణం చేసుకుంటున్న వేళా
జీవితాన్ని అన్వేషిస్తున్నవేళా
జీవితాన్ని జీవిస్తున్నా వేళా
ఆమె నా సహచరి

ఆలోచనకు అనుభవానికి మధ్య తేడాని
అవపోసనం పడుతున్న వేళా
అనుకున్నవి జరగక పోవటమే కాదు
అనుకోనివి జరగటమే జీవితం అని తెలుసుకుంటున్న వేళా
తన ప్రవాహంలోపడి కొట్టుకు పోవటమే తప్ప
తనను దాటుకొని వెళ్ళలేమనే నిజాన్ని నిర్దారించుకుంటున్న వేళా
ఆమె నా సహచరి

గతం చేసిన గాయాలపై 
జ్ఞాపకాల లేపనాలను పూస్తున్న వేళా
నడిసోచ్చే సమయం అయిపోయిన వేళా
నడిసోచ్చిన నిన్నని నెమరు వేసుకుoటున్న వేళా
అడుగు జాడలను ఆనవాళ్ళుగా మలచుకుంటున్న వేళా
అనుభవాల సారాన్ని అక్షరికారిస్తున్నవేళా
 ఆమె నా సహచరి

అమ్మ పోత్తిళ్ళ లో మొదలైన ఆ క్షణం నుండి
మట్టి పొత్తిళ్ళలో లోకి చేరే ఆకరి క్షణం వరకు
అప్పుడు ఇప్పుడు  ఎప్పుడూ
కాలమే (ఆమె) నా సహచరి.

                                               రచన
                                      సతీష్ కుమార్ బొట్ల
                                         బొట్ల వనపర్తి , 
                                          కరీంనగర్
                                                    9985960614.

No comments:

Post a Comment