Friday 26 October 2012

మరణ మజిలి




రాత్రిం బవళ్ళ చక్రం లో 
జనన మరణాల జగత్తులో 
ఈ క్షణం జీవిస్తూ 
మరు క్షణం మరణిస్తూ 
ప్రతి క్షణాన్ని  ఆస్వాదిస్తూ 
అనుక్షణం మరణిస్తూ ,జీవిస్తూ ఉంటాను 
ప్రతి జీవితం ఒక్క అన్వేషణ 
ప్రతి అన్వేషణ ఒక్క మజిలి 
ప్రతి మజిలి మరణం వరకే 
మరణమే కదా జీవితపు ముగింపు 

పువ్వులు రాలిన కాడలు
తెగిపడిన తారలు
వెలుగుతూ కరిగే కొవ్వొత్తి 
వికసించి మోడుబారే వృక్షాలు 
అన్నిటి పయనం 
జీవిస్తూ మరణం వైపుకే 
చీకటిని నేట్టుకువచ్చే వేకువ 
వేకువను నేట్టుకువచ్చే చీకటి 
సాగర గోషను మోసుకొచ్చే అలలు
రాలిన పువ్వుల పరిమళాన్ని వెదజల్లే గాలి 
నిశబ్దాన్ని పెనవేసుకునే నిశీది
అన్నింటి మజిలి మరణమే 

ఉదయ అస్తమయాలలోన
తూర్పు ,పడమరలలోన ఎరుపెక్కే సిందూరం 
సాగర అలలను ముద్దాడే సౌర వికిరణాల మధ్యలోని 
మహోజ్వలమైన పగలు పరమపదిస్తేనే కదా 
చంద్రుడి వెలుగుల తారల జిలుగుల 
తామసికి తోరణమాయ్యేది  
రాత్రి మరణిస్తేనే వేకువ జన్మిస్తుంది 
వెలుగు అస్తమిస్తేనే చీకటి అంకురిస్తుంది 
శరదృతువు వరకు చెదరని చిరునవ్వుల శోబ
శిశిరంలో చేజరితేనే కదా 
వసంతోత్సాహం  వికసిస్తుంది 

ఏదైనా ఎంతకాలం శాశ్వతం 
మరణానికి ఏది కాదు అనర్హం 
ప్రతి మరణం  మరో జననం 
అందుకే అంతంకోసం కాదు 
ఆరంబం కోసం మరణించాలి 
సంతోషమే సర్వం అయితే 
దు;ఖనికి చోటుఉంటుందా 
విజయమే జీవితమైతే 
విషాదానికి విలువఉటుంద
జీవితమే శాశ్వతమైతే 
మరణానికి అర్ధం ఉంటుందా 

అందుకే 
మరణం వైపు జీవననదిని  సాగనివ్వాలి
మరణ పరిమళాలను వెదజల్లాలి 
మరణ సుస్వరాలు అలాపించాలి
మరణ మృదంగాన్ని మ్రోగించాలి 
మరణ మజిలిని సాగనివ్వాలి 
బ్రతుకుతూ మరణాన్ని అనునయించాలి     
మరణిస్తూ మరణన్ని ఆస్వాదించాలి . 

                                          రచన 
                                  సతీష్ కుమార్ , బొట్ల 
                                       బొట్లవనపర్తి 
                                        కరీంనగర్  
                                     9985960614
                           botla1987.mygoal@gmail.com                                           

No comments:

Post a Comment