జరిగి పాయిన జీవిత పోరాటంలోన
గతం లోకి తొంగి చూస్తే
ఎం సాదించామో చెప్పాలేకపోతే
ఎలా జీవించామో తెలియకపోతే
ఎలా జీవించాలో అర్ధం కాకపోతే
అల జీవించటం కన్నా
మరణం నయ్యం
జీవించిన మనకన్నా
జీవంలేని రాళ్ళూ నయ్యం
ప్రాణమున్న మనం చెయ్యలేని పనులు
ప్రాణంలేని ఎన్నో సదిస్తూన్నాయ్
ఒక్కొక్కసారి బండరాళ్ళు సైతం
నిర్మాణాలై చరిత్ర కేక్కుతున్నాయ్
కొండకోనలు సైతం ఎన్నో జీవితాలకు
ఆదారన్నిస్తూ చరిత్ర తో నడిచివస్తున్నాయి
పుడ్చినంక మనపై కట్టే సమాధులు సైతం
బాటసారికి అలసట తిరస్తూన్నాయి
జీవితంలో పోరాటం చేయలేనివాడు
పోరాడి జీవితాన్ని గెలవలేనివాడు
గెలిచినాదాన్ని పది మందికి పంచలేనివాడు
చరిత్ర కేక్కనివాడు
చరిత్ర సృష్టిoచలేనివాడు
మరణించిననాడు
చరిత్రలో ఏ మార్పు నమోదు కాదు
ఎందుకంటే
గతం లేని జీవితం ఉండదు
గొప్పతనం లేని గతానికి విలువుండదు
ఆలాంటి జీవితానికి ముందు వెనుక
చరిత్రలో ఏమి ఉండదు
కారణం
చరిత్రకెక్కని ఏ నిజమైన చరిత్రలో కలిసిపోతుంది
మహోన్నతంగా ఎదగని ఏ జీవితమైన మట్టికొట్టుకు పోతుంది.
రచన
సతీష్ కుమార్ .బొట్ల
బొట్లవనపర్తి
కరీంనగర్
9985960614
botla1987.mygoal @ gmail.com
www.jaitelangana.com
No comments:
Post a Comment