Friday 26 October 2012

ఊరు



వన చినుకు నేలను తాకగానే 
మట్టి వాసనా పరిమలించినట్లు 
మధురమైన స్మృతులు మదిలో మెదలగానే 
మా ఉరు జ్ఞాపకాలు సజీవ చిత్రాలై 
కనులలో కదలాడుతూ ఉన్నాయ్  
మా ఉరు........

చినుకు పలకరించగానే 
చిగురకుకు జన్మనిస్తూ  
పుడమి పై పచ్చని పైటనరేసేది
సినుకుల ఎద్దడి తగ్గినక 
సికరాల శిరస్సు పై 
సింగిడి రంగులనారెసేది 
అ క్షణం లో
 ఆకులపై నుండి  రాలి పడుతున్న 
నీటి  బిందువులతో ఆటలాడిన జ్ఞాపకాలు 
పచ్చని  చిర పై ఎర్రని బొట్లు పెట్టినట్లు 
పసిరిక నేలల్లో అరిద్ర పురుగుల ఆనవాలు 
చురు నీళ్ళ ను పల్లలతో పట్టిన స్మృతులు 
నీటిలో కాగితపు పడవలేసిన   గుర్తులు 
చెరువు నిండగానే చేపల వేటలు 
అలుగు మత్తల్ల కింద స్నానాల ఆటలు  

చలి ముదరగానే 
పొగమంచు తో అల్లేసేది 
ఒళ్ళు ను జలదరింప చేసేదీ 
నింగి నుండి హిమమై  కురిసి 
నేలపై పచ్చని పపసిరికపై ముత్యపు బిందువై మెరిసేది 
పదాలు తాకగానే గిలిగింతలు పెట్టేది 
పులకింత రేపేది 
అ క్షణం లో....
చలి మంటల చుట్టూ చేతులు నలుచుకుంటూ 
కూర్చున్న జ్ఞాపకాలు 
అమ్మ ఒల్లో తలవాల్చి పడుకున్న ఆనవాలు 

ఎండలు ముదరంగనే 
ఎగిలివారంగా తూర్పు నోదుటన సిందూరo  అయ్యేది   
చెర్లు  అన్ని ఎండి చెన్లన్ని కోసినంక 
సాయంకాలం గోదులి తో కమ్ముతూ 
ఎడారిని తలపించేది 
అరిపాదలకింద  మంటలు పెట్టేది 
ఆరుబయట పదకలెఇన్చెది 
అ క్షణం లో
చల్లదనం లో సేదతిరెందుకు 
ఈత  కొలనులో ఈదులడిన జ్ఞాపకాలు 
ఈతకాయల వెంట పరుగులెత్తిన క్షణాలు 
మరెన్నో మదురమైన జ్ఞాపకాలు 

గ్రామదేవతల కొలుపులు 
వనబోజనాలు
 పిరిల్ల ఆటలు 
బతుకమ్మ పాటలు 
దసరా వేషాలు 
ఉగాది ఉత్సావాలతో 
ఏడాదికి   కోక్కసారి జాతర 
ఏడాదంతా పండగాలగుండేది ఊరు .....

కనిప్పుడు 
కొలువులకోసం చదువుకున్నోళ్ళు ఊరు విడిచి వెళ్తుంటే 
చదువు లేనోళ్ళు వలసా బట పడుతుంటే 
ఏలిననాటి జ్ఞాపకాలతో కాలం  ఎల్లదిస్తున్నది 
 ఎల్లిపోతున్న ఊరు 

కులమతాలకు అతీతంగా 
అలై బలై ముచట్లతో 
ఆత్మీయ బంధమై 
అనురాగ గందమైన ఊరు ఇప్పుడు 
రాజకీయాలు గ్రామానికి చేరినంక 
వర్గాల పోరులో 
ఆధిపత్య జోరులో 
అహంకారిత చర్యలకు 
అరణ్య రోధనైంది .  

అదునికరణ పేరుతో 
నాగరికత నెపంతో 
పంట పొలాలను చిమేస్తూ 
ప్లాట్ లు వేలుస్తుంటే 
ఊరంతా పారించిన చెరువుకు 
ఊరులో చోటు లేకుంటే 
పచ్చని  వనసంపద 
ఫారెస్ట్ వాళ్ళు వశం చేసుకుంటే 
చివరికి కొండలు సైతం 
కాంక్రీట్ , గ్రానైట్ క్వారీలు 
కబలించి వేస్తుంటే 
జనం శ్రుతి తప్పుతుంటే 
ఊరు గతి తప్పుతూ 
గతాన్ని నెమరువేసుకుంటూ 
వర్తమానంలోకి వెళ్తుంది 
పుడమి పై పచ్చని పైటనరేసినట్లు 
ప్రకృతిని పొగమంచుతో కప్పెసినట్లు 
తుర్పునోదుటన ఎర్రని సింధూర మైనట్లు 
ఉండే నా  ఉరు ఇప్పుడు 
తన ఉనికిని కోల్పోయి 
 తన అస్తిత్వానికై  ఆరాటపడుతూ 
గతాన్ని నెమరువేసుకుంటూ 
గతం పునరావృతం  కావాలని 
కోరుకుంటుంది ఊరు ....

( మనసున్న మనుషులుగా ఆలోచిద్దాం మన ఊర్లను మల్లి నిర్మించుకుందాం !
villages are backbone of our country never distraid it.) 

                                                                              రచన 

                                                         సతీష్ కుమార్ బోట్ల 
                                                          బొట్లవనపర్తి 
                                                            కరీంనగర్              
                                                        9985960614
                                             botla1987.mygoal@gmail.com

No comments:

Post a Comment