Friday 26 October 2012

అమ్మ


తెల్లవారు జామున  లేచి 
పాలుపితుకుతుంటే అమ్మ 
పల్లె తల్లి పూలకరిన్చి పోయేది  
తన జీవితం లోని కష్ట సుఖాలను
కల్లాపి చేసి చల్లుతుంటే అమ్మ 
పోక్కిల్లెత్తిన  వాకిళ్ళు పరవశించి పోయేవి 
పసుపు కుంకుమలు ధరించిన గౌరమ్మాల 
పసిడివేలుగుల పండగల 
బతుకమ్మతో  బాజరులోకి   (వీది)  అడుగు పెడుతుంటే అమ్మ
ఆమెనే అనుసరించేవాళ్ళు తంగెల్లెత్తిన  తరుణీలందరూ    

ముత్యమంటి నవ్వు తో 
ముతైదువు ఛాయాతో 
తను ముందుంటే మంగళ ప్రదమంటూ
పట్టుపట్టి మరి పట్టుకేల్లెవారు (తిసుకేల్లెవారు )
పక్కవారు అందరు అమ్మను శుభకార్యాలకు 
అమ్మ అరంబిస్తే కార్యాలు అవిజ్ఞ మయ్యేవి  
అమ్మ పూజిస్తే రాయి దైవమయ్యేది    
కాని 
దైవమే  రాయైనవేల 
కడదాక తోడు ఉంటాడనుకున్ననాన్నను 
కాలం కాటేసి అమ్మను కాలచక్రం లో వదిలేసి వెళ్తే 
కన్నీరు అణుచుకొని మమ్మల్నికాచుకుంది  అమ్మ      

పసుపు కుంకుమలు రాలి 
నోదుటన విబూది  చేరి
ముతైదువు అన్న పదం మారి
మంగళప్రదం అన్నవారే  మాట మర్చుతుంటే
రాలిన పసుపు కుంకుమల తో 
సూర్యుడు అస్తమించిన ఆకాశంల 
శూన్యం ఆవహించిన అనంతంల
ఆరిపోని అశ్రుతడిని  దిగమింగుతూ అమ్మ.......

పూటకో మాట మార్చే పరులు 
పలు రకాలుగా ప్రవర్తించిన 
సమస్తం మాకు అమ్మే 
సకల శుబాప్రదం మాకు అమ్మే 
అమ్మే మా దైవం 
అంకితం ఆమెకే ఈ జీవితం .   

(నన్ను కని పెంచిన నా తల్లి కి పాదాబి వందనాలతో.............  )
     

                                                                                 రచన 
                                                          సతీష్  కుమార్ బొట్ల 
                                                               బొట్లవనపర్తి 
                                                                 కరీంనగర్
                                                            9985960614
                                                  botla1987.mygoal@gmail.com

No comments:

Post a Comment