Wednesday 14 November 2012

మా పెరట్లో చింతచెట్టు




మా  నాయినమ్మ జెప్పుతుండేది 
మా తాత పెరటి పొలం కొన్నప్పుడు 
మా నయిన పెట్టిండని పెరట్లో చింత చెట్టు 
భద్రంగా గసిండని అది పెరిగెట్టు 
మా నయిన తో పాటే  అది పెరిగి 
అయినా జీవితాన్ని  ప్రతిబింబించే మహా  వృక్షమైంది 

శరదృతువులో రాలిన ఆకులతో 
చేనంతపరిచిన ఎర్ర తివాచి లా 
శ్రామిక వర్గానికి , విప్లవ మార్గానికి 
ప్రతిరుపంలా అగుపించేది 
మా నాయిన లోని ఆవేశాన్ని తలిపించేది 
వసంతంలో వికశించిన ఆకులతో 
వివిధ రకాల రంగులతో 
సర్వమత సమ్మేళనాన్ని సూచించేది 
మా నాయిన లోని ఆలోచనలాల అగుపించేది 
ఋతువులకు అది మారుతూ 
జీవిత దశలను చూపించేది 
మా నాయిన లోని సర్వగుణ సంమేలనంలా కనిపించేది 

ఎంత ఆత్మీయంగా పెంచాడో మా నాయిన 
ఎ అవసరం వచ్చిన దాని అంగాల్ని తుంచకుండా 
అంతే ఆత్మీయత కురిపించేది అది మా పై 
ఎండల్లో నీడయ్యేది 
వానల్లో గోడుగయ్యేది  
మాతో మమేకమై 
కతికొమ్మ ఆటలాడేది 
ఉగాదీ పచ్చడై నోరు తడిపేది 
చరై అమ్మ చేతి వంటకు రుచిని పెంచేది 


మా నాయిన జీవితాన్ని ప్రతిబింబిస్తూ 
మా నాయిన కన్నా కొంత ముందుగాల్నే నేలకొరిగింది 
మా నాయిన వొరిగిపాయినంక గూడా 
దాని అభిమానాన్ని చాటుకుంటూ 
ఆయానకు చితి పనుపైంది 
నయినా చితబస్మంలో మమేకమైంది 

నేను ఊరేల్లిన ప్రతిసారి 
పెరట్లోకేల్లుతాను 
అది నిలిచినా చోటికి చేరుతాను 
అక్కడ 
మా మా నాయిన అడుగుల అనవల్లెమైన కనిపిస్తాయోనని 
అది నిలిచినా క్షణాలేమైన తిరిగోస్తాయోనని 
అంతలోనే తేరుకొని 
అదంతా గతమని తెలుసుకొని 
బరువెక్కిన జ్ఞాపకాల బారంతో 
కన్నీళ్ళతో మసకబారిన దారుల్లో తిరిగోస్తాను 
ఐన 

మరణించిన మా నాయిన
మాలో జీవించి ఉన్నట్లే 
మా పెరట్లో చింతచేట్టు కుడా 
మాకు మరుపు లేని జ్ఞాపకమే 
మార్చలేని గతమే.........


                            రచన 
                   సతీష్ కుమార్ బోట్ల 
                       బొట్లవనపర్తి 
                         కరీంనగర్  
              botla1987.mygoal@gmail.com
                  botlasjindagi.blogspot.in
                    Jaitelangana.com

No comments:

Post a Comment