Tuesday 30 April 2013

బౌతిక చరిత్ర



ఎ చరిత్ర చుసిన ఏముంది గర్వకారణం
అని మహాకవి అన్నట్లు
ఎ చరిత్రలోను ఏముంది
బహుగోప్పగా బౌతికంగా  
చెదలుపట్టి చేరిగిపోయిన కాగితాలు
చిలుముపట్టిన శిల శాసనాలు
శిదిలమైన రాజ్యాల కోటలు
చిరునామాగా మిగిలిన మొండి గోడలు
సైనికుల సమాధులపై ఏర్పడ్డ స్మశానాలు
సమాధులపై పునాదులు వెలిసిన సామ్రాజ్యాలు

ఎ చరిత్ర లోనైనా
స్వార్ధం ఒక్క ప్రాధమిక శక్తి
రాచరికం ఒక్క  వారసత్వపు ఆశక్తి
గెలుపోటములు తరంగాధైర్గ్యలు
చేతులుమరే రాజ్యాలు శక్తి నిత్యత్వ నియమాలు
అధికారం ఆయస్కాంతికరణం
అది అందుకోనెందుకే చేసే ప్రయత్నమే త్వరణం
రాజ్యం ఒక్క కేంద్ర బిందువు
రాజ్య పాలనా పక్రియ ఓ త్రికబిందువు
రాజ్య విస్తరనే కేంద్రక సంలీనం
రాజ్య విమోచానమే కేంద్రక విచ్చిత్తి
రాజి కుదిరితే అనులోమానుపాతం
రాజి చెడితే విలోమనుపాతం
యుద్ధం ఒక్క అణు విస్పోటనం
తట్టుకొని నిలబడితే జడత్వం
తడబడి కూలిపోతే గురుత్వం
మొత్తంగా చరిత్ర
మట్టి పొరల్లో మరుగున పడ్డ నిజం
మూలాలను తవ్వి వెలికి తీయటమే మనిషి నైజం.


                                            రచన
                                     సతీష్ కుమార్ బోట్ల
                                          బొట్లవనపర్తి
                                           కరీంనగర్
                                                   9985960614
                                         Botla1987.mygoal@gmail.com
                                               Botlasjindagi.blogspot.in  
                                               www.Jaitelangana.com 

1 comment: