Friday 19 April 2013

మిరేవ్వరైన చూసారా?



హిమగిరి శికరాల అంచులో
సౌందర్యపు కాశ్మీరు మంచులో
మిరేవ్వరైన విన్నారా ?
రణరంగమై మ్రోగిన రణధ్వన రోదనలను
తరంగమై ఎగిసిన తరతరాల పోరు కాంక్షను
మిరేవ్వరైన చూసారా?

దవల దత్రికై
దౌత్య అత్రికై
అస్రం తో తడిసిన మంచును
అంగరక్షకుల అణువణువు చీల్చిన తూటాను
మిరేప్పుడైన చూసారా ?
కళేబరాలను సైతం కరిగించే మంచులో
కళేబరాల మాటున ఉన్న మాంసంలో
మరుగుతున్న మాతృభూమి ప్రేమకై
మరణాయుదాల ముందుకు
మరణ శయ్యల పైనకు
ప్రాణాలు విహంగాలై ఎగురుతున్న
పట్టుదలతో తురంగాలై సాగుతున్న
సైనికులను మిరేప్పుడైన చూసారా ?

మిరేప్పుడైన చూసారా ?
ముళ్ళ కంచేలమాటున
బండరాళ్ల చాటున
ఉక్కు దేహమై నిలిచి
పక్కురని చర్మమై వేలిచి
పాశానం ల కనిపిస్తున్న
ప్రతి సైనికుడి హృదయం లోని సున్నిత బావాలను
సుదూరంగా ఉన్న తమవారి స్వప్నాలను

మిరేవ్వరైన చూసారా
కార్గిల్ యుద్దo కోరాల్లో చిక్కి
కష్టం పైకెక్కి కాణాకన మండే ఎర్రని రవ్వలై
నింగికేగిసిన అరుణ వర్ణ సైనిక కిరణాలను
ఆర్తిగా మాతృభూమి ఒడిలో రాలిన కుసుమాలను

మిరేప్పుడైన చూసారా ?
రాజస్తాన్ బోర్డర్ లో
థార్ ఎడారి దారుల్లో
నెత్తురు తో చల్లారిన ఇసుకను
సైనికుల ఆశలతో నిండిన ఒయసిస్సులను
శత్రువులకు చిక్కి చిత్రహింసలు చేయబడ్డ
సైనికుల దేహాలను
చిదిలామైన వారి స్వప్నాలను

మిరేవ్వరైన తాడిచారా ?
తలలు లేని తమవారి దేహాలను చూసి
తల్లడిల్లిన తల్లిదండ్రుల కన్నీళ్ళలో
మిరేవ్వరైన తాడిచారా
వారికోసం కన్నీరైన కార్చారా!
మిరేవ్వరైన పిల్చారా ?
పోరులో సైనికులు చిమ్మిన రుదిరపు వాసనల్ని
తమవారికి సైనికులు పంపిన బసలాని

మిరేవ్వరైన చూసారా?
సైనిక శిబిరాల్లో సర్వం కోల్పోయి
సమస్తం చేజారిపోయి
విరిగిపోయిన కాలానికి చిహ్నంగా
జీవితం తో పోరాటం చేయవలిసిన బలగాలుగా
బ్రతుకు బండి కీళ్ళుడి
భవిష్యతు ఆశల మేడలు కులిపడి
ధైర్యం దైన్యమైన సందర్భాన్ని
మానవత్వం మౌనమైన క్షణాన్ని
మనకోసం ప్రాణాలర్పించినవారిని
ప్రాణం తప్ప ఎం మిగిల్చుకోనివారిని
మిరేవ్వరైన చూసారా
వారికోసం కన్నీరైన కార్చారా
వారికీ సలమైన చేసారా
అసలు వారిని
మేరేవ్వరైన చూసారా ?
( దేశం కోసం మనకోసం ప్రాణాలను పణంగా పెట్ట పోరాడిన పోరాడుతున్న సైనిక వీరులకు సలాం చేస్తూ అంకితమిస్తున్నాను )

జై భారత్              జై జవాన్ .
                                   రచన
                           సతీష్ కుమార్ బోట్ల
                               బొట్లవనపర్తి
                               కరీంనగర్
                                       9985960614
                          Botla1987.mygoal@gmail.com
                               Botlasjindagi.blogspot.in 
                              www.jaitelangana.com

No comments:

Post a Comment