Friday 26 April 2013

కలాతితమైనదని / సంస్కృతి


తర తరానికి ఆలోచన విదానం మారుతు
అగుపించని ప్రభావానికి లోనవుతూ
ఆధునీకరణ పేరుతో
నవీన నాగరికత నెపం తో
కాలం స్థానబ్రంశం చెందుతూ
 సంస్కృతి రూపాంతరం చేందుతుంది

చీరలు చిరాకు పుట్టిస్తుంటే
జీన్స్ జబర్దాస్ట్ చేస్తుంటే
మాతృ బాష మట్టిలో కలుస్తూ
పరాయి బాష పై పైకి పోతుంటే
సంస్కృతి సమాది అవుతుందని
సంప్రదాయం సచ్చిపోతుందని
గొంతెత్తుతున్నారు  సంస్కృతి ప్రేమికులు
సాంప్రదాయ వదికులకు

 వారికీ పోటిగా
పర్శియులతో ప్రారంబమై
బ్రిటిష్ వారి పాలనా లో పరిపుర్ణమై  
తార తరం లో  పరాయి సంస్కృతిని
నరనరంలో జీర్ణించుకున్నమని
సంస్కృతి సాగరం కాదని
నవీనమై నిరంతరం ప్రవహించే నది అని
మన బాష వేశాలలోనే బహుళత్వం ఉందని
మనం సాంప్రదాయ జడత్వం వదలాలని
గళమేత్తుతున్నా(రు ) నాగరికులు

కానీ
విరేవ్వరు   గ్రహించ లేకపోతున్నారు పాపం
మార్పు అనివార్యం అయినంత మాత్రాన
మన మూలాలు మార్చుకోవలసిన అవసరం లేదని
కొత్తదనం కోరుకున్నంత మాత్రాన
సనతనన్నే సమాది చేయాల్సిన పనిలేదని
నదులేన్ని కోత్తగా పుట్టు కొచ్చిన
అవి సంద్రం లోనే కలవాలిసిందేనని
సముద్రకృతి ని సంతరించుకోవలిసినదేనని
మన సంస్కృతి
కాలం తో కదిలిపోయేది కాదని
కలాతితమైనదని
కోత్త ను ఆహ్వానించాలి కాని
పాతను పాతరేయాకుడదని.

                                  రచన
                            సతీష్ కుమార్ బోట్ల
                               బొట్లవనపర్తి
                                కరీంనగర్
                                     9985960614
                     Botla1987.mygoal@gmail.com
                        Botlasjindagi.blogspot.in
                               www. Jaitelangana.com

No comments:

Post a Comment