Monday 4 July 2016

కల్లోలాన్ని కలగంటూ ..

ఆశలు రెక్కలు విప్పుకు ఎగురుతుంటే
ఆలోచనలు చుక్కలు దాటి సాగుతుంటే
కలగానని తీరంకై సాగుతున్న
కలల ప్రయాణంలో
నిశిధి వెదజల్లుతున్నా నిశబ్ధంలో
నిజాల వెతుకులాటలో
ఆత్మ సంతృప్తినివ్వని ఆత్మ విమర్శలతో
ప్రశ్నకి మరో ప్రశ్నే సమాదానమౌవుతున్న క్షణాల్లో
ఊపిరి సలపనివ్వని నిజాలు
ఉద్వేగంగా ఉభికి వస్తున్నా భావలు
అలలై ఎగసి కలాల్ని కులదోస్తూ
కలల సంద్రం నుండి తీరం వైపు నన్ను నేట్టేస్తుంటే
కడలి ఒడ్డున కూర్చుండి
కల్లోలాన్ని కలగంటున్నాను నేను


కల్లోలాన్ని కలగంటు నేనేం చేయాగాలను
అలల అలజడి గురించి ఆలోచిస్తూ
సంద్రం లోని అగాధాల్ని శోదిస్తూ
ఎత్తు పల్లాల గురించి కవిత్వం రాస్తాను
ఇసుకలోని గవ్వల్ని సంద్రం లోకి విసురుతూ
కాళ్ళకి వచ్చి తాకుతున్న కసికేల్ని చేతిలోకి తీసుకుంటూ
పోయేది పొందేది ఏది శాశ్వతం కాదని
పదాలు అల్లుతూ పాట కడుతను
అనంతమంత విస్తరించిన
సముద్రo పై  నీటి నురగాలను
అగాధంలోని ముత్యాల జిలుగులను
అనుసందానించాలనే ఉహాలు ఉప్పనై
సముద్రం నన్ను తనలోకి లాక్కుంటే
తెడ్డునై కలబడుతను / చేపల తుళ్ళి పడుతాను
తేలుతూ మునుగుతూ / తేరుకొని
సముద్రం ఆణువణువూ శోదించే పనిలో పడతాను
అప్పుడిక నాకు మాత్రమే తెలిసింది
ఎవ్వరికి తెలియంది
నాలో నేను లేనాని
కల్లోలం మాత్రమే మిగిలిందని.
                                       
                             Written by
                 
                 సతీష్ కుమార్ బొట్ల
                  Botlasjindagi.bolgspot.in
                           9985960614

                                    

No comments:

Post a Comment