Friday 8 November 2013

నా జీవితం లో ఓ సాయంత్రం ........




నిశిది వేలల్లో
నిశబ్దపు నీడల్లో
ఎటిఒడ్డు కూర్చొని
ఎక్కడినుండి ఇక్కడిదాకా వచ్చామని
ఆనవాళ్ళ స్మృతు(లు)ల ను నేమరువేసుకుంటూ
ఆలోచనలకూ చిగురు తోడుక్కుంటుంటే
మన మానవ మూల(లు)లనుండి
మాతృమూర్తి  ఒడిలో చేరేవరకు
జీవం పుట్టుక నుండి
జీవిగా నేను జన్మ నేత్తేవరకు
సాగిన నా ఆలోచనల సంఘర్షణలో
సృష్టి రహస్యo ఎదో నాకు బోదపడినట్లు
పాకృత గాధ సప్తశతి నాకు పరిచయమైనట్లు
సరిహద్దు దాటుతున్న నా  ఆలోచనలకూ అడ్డుకట్ట వేసేందుకు
శాబాష్ రా శంకర చేతిలోకందుకొని
శివతత్వాo లోకి లీనమాయి
మడత పేజి లు తిరిగేస్తూ
మానవధర్మం ను శోదిస్తూ
మానవత్వం పెంచుకుంటే
మనలోని దైవం ను దర్శించుకోవచ్చని
జీవన తరంగం
మరణ మృదంగం
అంత  ని ఆటగాదర శివ అనుకుంటూ
అందకారంలో నుoచి బయాటకి అడుగులేసుకుంటూ
కాలిబాట లో నడుచుకుంటూ
కటిననిజాలు నెమరువేసుకుంటూ
అంపశయ్య లాంటి పక్కపై పడిపోయి
ఆశల పల్లకిలో కి అడుగిడుతూ
కనురెప్పలు వల్చి కలల తెరచాప తెరిచి
కీచురాళ్ళు చేసే సడిలో సైతం నిద్ర ఒడిలోకి జారుకొని
స్వప్నలోకం లో విహరిస్తూ
సౌందర్యాఅన్వేషణ లో విలపిస్తూ
వెన్నెల్లో ఆడపిల్ల తో ఆటలాడి
అమృతం కురిసిన రాత్రి ని అదిమి పట్టుకునే లోపే
ఎక్కడో డేగరెక్కల చప్పుడు శబ్దం తో
చెదిరిన స్వప్నం విడువడిన కనురేప్పలకి
ఆకాశం  లో మిసిమిగా కనిపించే వేగుచుక్క
అంతర్ బ్రమానం లో వాస్తవాలను బోదిస్తూ
అనంతo అంత ఈ విశ్వం లో
మనం సాగించే ఈ ప్రస్తానం
ఎప్పుడు విడువడని చిక్కుముడి  యేనని
జనన మరణాల మధ్య బ్రతుకు ఒక్క సజీవ చిత్రం మాత్రమేనని
ఈ జీవితం లో చివరికి మిగిలేది శున్యమేనని
సూప్రభాతం తో నన్ను మేల్కొల్పుతూ
మరో ఉదయం ఉద్భవించింది నా  జీవితంలో
అది మరో  సాయంత్రనికి పునాది గా.

                                        రచన
                              సతీష్ కుమార్ బోట్ల
                                   బొట్లవనపర్తి
                                    కరీంనగర్ 
                                                 9985960614
                                    Botlasjindagi.blogspot.in
                                     www.jaitelangana.com

5 comments:

  1. నా స్నేహితుడు తనకి నచ్చిన పుస్తకాల లిస్టు పంపాడు నన్ను కూడా ఆ పుస్తకాలూ చదవమని..... కానీ న బద్ధకం తో ఆ పుస్తకలు చదవలేదు కానీ ఆ పుస్తకాలన్నింటి పేర్లు వచ్చేలా నా జీవితం లో ని ఓ సాయంత్త్రపు అనుభవాలతో ఓ కవిత రాస్తే ఎలాఉంటుంది అనే ఆలోచనతో ఈ చిన్న ప్రయోగం చేసాను..... సతీష్ కుమార్ బోట్ల.

    ReplyDelete
  2. ప్రియ మిత్రమా నీ కవితా శక్తిని ప్రశంసించకుండా ఉండలేకున్న......నీ కవితా చాతుర్యానికి జోహార్లు,దేవుని ఆశీస్సులతో మున్ముందు మరెన్నో కవితలు రాయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ .........నవీన్ కుమార్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు నేస్తమా

      Delete
  3. Very nice Satish..gaaru... Supperro suppperrr... :-):-) mee friendku naa boledanni danyavadaalu, naaku mee dvaara inni manchi manchi pustakaalu cheppadu:-):-)

    ReplyDelete